Home » ఉమ్రాన్ జాతీయ జట్టుకు ఎంపిక కావడం పై తండ్రి ఎమోషల్..!

ఉమ్రాన్ జాతీయ జట్టుకు ఎంపిక కావడం పై తండ్రి ఎమోషల్..!

by Azhar
Ad

సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి గత ఏడాది టి.నటరాజన్ గాయంతో దూరం అవడం వల్ల ఎంట్రీ ఇచ్చాడు పేసర్ ఉమ్రాన్ మాలిక్. ఆ తర్వాత తన స్పీడ్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఉమ్రాన్ ను ఈ ఏడాది ఐపీఎల్ ముందు రిటైన్ చేసుకుంది సన్ రైజర్స్. అయితే ఈ ఐపీఎల్ లో 2022 లో హైదరాబాద్ తరపున ప్రతి మ్యాచ్ ఆడిన ఉమ్రాన్ అందరి ప్రశంసలు పొందాడు. వేసే ప్రతి ఓవర్ 150 కీ.మీ కంటే ఎక్కువ వేగంతో సంధించే ఉమ్రాన్ ను జాతీయ జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్ ఎక్కువైంది. అలాగే కేవలం వేగాన్ని నమ్ముకొని బౌలింగ్ చేస్తది కాబట్టి.. అప్పుడే ఎంపిక చేయవద్దు అని కూడా కొందరు అన్నారు.

Advertisement

కానీ బీసీసీఐ సెలక్టర్లు మాత్రం మెజారిటీ డిమాండ్ కే ఓకే చెప్పారు. సౌత్ ఆఫ్రికాతో ఈ ఐపీఎల్ తర్వాత జరగనున్న టీ20 సిరీస్ కు జట్టును ఎంపిక చేసిన బీసీసీఐ.. ఆ 18 మందిలో ఉమ్రాన్ మాలిక్ కు చోటు కల్పించారు సెలక్టర్లు. ఇక తన కొడుకు ఇండియా జట్టుకు ఎంపిక కావడం పై ఉమ్రాన్ తండ్రి రషీద్ ఎమోషనల్ అయ్యాడు. తాజాగా ఓ జాతీయ ఛానెల్ తో ఉమ్రాన్ తండ్రి మాట్లాడుతూ… ఉమ్రాన్ మా అందరిని గర్వపడేలా చేసాడు. మాకు పేరు తెచ్చాడు. అందుకు మేమే ఉమ్రాన్ కు కృతజ్ఞతలు చెప్పాలి. దేశంకోసం ఆడటం కంటే ఇంకా గొప్ప విషయం ఏం ఉంటుంది. ఉమ్రాన్ తన టాలెంట్ ను నమ్ముకొని ఇక్కడికి వచ్చాడు.

Advertisement

నానా కొడుకు చిన్నపాటి నుండి ఎంతకాష్ఠ పడ్డాడో మాకు తెలుసు. అతని కష్టానికి ప్రతిఫలం ఇప్పుడు వచ్చింది. దేశ వ్యాప్తంగా ఉమ్రాన్ కు మద్దతు ఆనందించే మంచి విషయం. ఇక ఉమ్రాన్ ఏ రోజైతే ఇండియా తరపున అరంగేట్రం చేస్తాడో.. ఆరోజు నేను, నా భార్య తనకు ఉత్సాహాన్ని ఇచ్చేందుకు ఆ మ్యాచ్ కు వెళ్తాము అని చెప్పాడు. అలాగే చివరగా ఇక చాలు.. నా కొడుకు ఎవరికీ ఇంటర్వ్యూ లు ఇవ్వకు అని చెప్పాడు అంటూ ముగించాడు ఉమ్రాన్ తండ్రి రషీద్. అయితే ఆయన జమ్మూలో ఓ పండ్ల మార్కెట్ లో పని చేస్తాడు అనే మనకు తెలిసిందే.

ఇవి కూడా చదవండి :

ఐపీఎల్ లో ఆడకపోవడమే మంచి పని అంటున్న పుజారా…!

రోహిత్ కు రెస్ట్ ఇవ్వడం అవసరే లేదు.. ఆతను ఏం ఆడాడు..!

Visitors Are Also Reading