Home » షారూఖ్ సినిమాలో బన్నీ..  షూటింగ్ కూడా ఫినిష్ ? 

షారూఖ్ సినిమాలో బన్నీ..  షూటింగ్ కూడా ఫినిష్ ? 

by Anji
Ad

టాలీవుడ్ సినిమాలు, హీరోలు రోజు రోజుకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నారు. ముఖ్యంగా దర్శక ధీరుడు తెరకెక్కించిన బాహుబలి సినిమా ఎంతటి క్రేజ్ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. బాహుబలి తరువాత రాజమౌళి తెరకెక్కించిన RRR చిత్రంతో రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందారు. అయితే ఒకప్పుడు పాన్ ఇండియా అంటే ఎక్కువగా బాలీవుడ్ హీరోల హవానే ఎక్కువగా కొనసాగేది. కానీ ప్రస్తుతం దక్షిణాది హీరోలు కూడా పాన్ ఇండియా లెవల్ రాణించగలరని బాహుబలి, RRR, పుష్ప వంటి సినిమాలు నిరూపించాయి.  

Also Read :  జ‌యం నుండి జాను వ‌ర‌కూ అల్లు అర్జున్ చేతులారా వ‌దులుకున్న 10 బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు ఇవే.!

Advertisement

టాలీవుడ్ సినిమా రేంజ్ ఇంతలా మారుతుందని బాలీవుడ్ వారు అస్సలు ఊహించి ఉండరు. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలు బాలీవుడ్ డెబ్యూ లు సిద్ధమయ్యాయి. రెబల్ స్టార్  ప్రభాస్ ఆదిపురుష్, ఎన్టీఆర్ వార్ 2, త్వరలో అల్లు అర్జున్ సైతం బాలీవుడ్ డెబ్యూ ఇవ్వనున్నాడు. దీనికి ముందే అల్లు అర్జున్ ఓ బాలీవుడ్ మూవీలో క్యామియో రోల్ లో కనిపించనున్నాడు. షారూఖ్ ఖాన్, నయనతార జంటగా కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జవాన్. షారూఖ్ నిర్మాణ సంస్థ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ పై ఈ చిత్రం భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో షారూఖ్ తో పాటు అల్లు అర్జున్ కూడా కనిపించనున్నాడని వార్తలు వినిపించాయి. ఈ వార్తలో వాస్తవం లేదని కూడా మరికొన్ని వార్తలు వచ్చాయి. దీంతో అభిమానులు కాస్త నిరాశ చెందారు. 

Advertisement

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. జవాన్ లో అల్లు అర్జున్ ఓ క్యామియో రోల్ చేస్తున్నట్టు వచ్చిన వార్త నిజమేనట. క్లైమాక్స్ లో షారూఖ్ కి హెల్ప్ చేసే హీరోగా బన్నీ రంగంలోకి దిగనున్నాడట. ఇక ఇప్పటికే బన్నీకి సంబంధించినటువంటి సీన్స్ కూడా షూటింగ్ పూర్తి చేసుకున్నట్టు సమాచారం. అంతేకాదు.. త్వరలో విడుదల కాబోయే టీజర్ లో బన్నీ లుక్ ను కూడా చూపించనున్నారట. ఇక ఈ వార్త తెలిసిన అల్లు అర్జున్ అభిమానులు సంతోషపడుతున్నారు. బన్నీతో పాటు దీపికా పదుకొనే కూడా క్యామియో రోల్ లో కనిపించనుంది. ఈ చిత్రంలో వీరిద్దరూ ఎలాంటి పాత్రలో కనిపిస్తారో చూడాలి. జూన్ 02, 2023న జవాన్ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాతో షారూఖ్ అన్ని భాషల్లో ప్రేక్షకులను ఎలా మెప్పిస్తాడో వేచి చూడాలి. 

Also Read :  నంది అవార్డులపై విజయేంద్ర ప్రసాద్ కీలక వ్యాఖ్యలు..!

Visitors Are Also Reading