సామాన్య ప్రజలకు ఓ శుభవార్త అనే చెప్పాలి. ఎందుకంటే నవంబర్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 5.88 శాతానికి తగ్గింది. అక్టోబర్ 2022లో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 6.77 శాతం ఉంది. ఏడాది కిందట నవంబర్ 2021లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.91 శాతం ఉంది. ఇక ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం రేటులో భారీగా తగ్గదల కనిపిస్తోంది. ఆహార ద్రవ్యోల్బణం నవంబర్ 4.67 శాతానికి తగ్గగా.. అక్టోబర్ లో ఆహార ద్రవ్యోల్బణం 7.01 శాతంగా ఉంది. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో ఆహార ద్రవ్యోల్బణం తగ్గింది.
Advertisement
తాజాగా కేంద్ర గణాంక కార్యాలయం కీలక గణాంకాలను వెల్లడించింది. ఆహార పదార్థాల ధరలు తగ్గుముఖం పట్టడంతో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టినప్పటికీ ఆర్బీఐ నిర్దేశించుకున్న సౌకర్యవంతమైన స్థాయికి పైగానే ఉండడం గమనార్హం. రిటైల్ ద్రవ్యోల్భణం తగ్గడానికి ప్రధాన కారణం ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం రేటు తగ్గడమే. ఆహార ద్రవ్యోల్బణం రేటు అక్టోబర్ 2022లో 7.01 శాతంగా ఉంది. నవంబర్ లో 4.67 శాతానికి తగ్గింది. మరోవైపు అక్టోబర్ నెలలో పట్టణ ప్రాంతాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 6.53 శాతం ఉండగా, నవంబర్ లో 3.69 శాతానికి తగ్గింది. గ్రామీణ ప్రాంతాలలో రిటైల్ ద్రవ్యోల్బణం అక్టోబర్ లో 7.30 శాతం ఉండగా.. నవంబర్ లో 5.22 శాతానికి తగ్గింది. ఆకుకూరలు, కూరగాయల ద్రవ్యోల్బణం -8.08 శాతానికి తగ్గింది. పండ్ల ద్రవ్యోల్బణం 2.62 శాతముగా ఉంది.
Advertisement
Also Read : అఖండ సినిమా లో ఈ మిస్టేక్ గమనించారా ? చూసుకోవాలిగా బోయ పాటి గారు అంటూ ట్రోల్ల్స్ ..!
ఇక రిటైల్ ద్రవ్యోల్బణం రేటు ఆర్బీఐ టాలరెన్స్ బ్యాండ్ 6 శాతం ఎగువ స్థాయి కంటే దిగువకు దిగజారడం అతిపెద్ద ఉపశమనం అనే చెప్పవచ్చు. ఆర్బీఐ 2 నుంచి 6శాతం ద్రవ్యోల్బణం రేటును సహించం అని నిర్ణయించింది. కానీ రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐ టాలరెన్స్ బ్యాండ్ కంటే స్థిరంగా ఉంది. ఏప్రిల్ లో రిటైల్ ద్రవ్యోల్బణం రేటు 7.79 శాతానికి చేరుకుంది. ఆ తరువాత ఐదు ద్రవ్య విధాన సమావేశల తరువాత ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఆర్బీఐ రెపోరేటును పెంచింది. రెపో రేటు 4 శాతం నుంచి 6.25 శాతానికి పెరిగింది. ఇలాగే ద్రవ్యోల్బణం తగ్గితే రాబోయే ఏడాదిలో వడ్డీ రేటు కూడా తగ్గొచ్చు. ఇక రెపో రేటు పెంపు ప్రక్రియ ఆగిపోవచ్చు. రిటైల్ ద్రవ్యోల్బణం రేటులో పతనం పెరిగితే వడ్డీ రేట్లు చౌకగా మారే అవకాశముంది.