Home » Pulsar 150 బైక్ ను బ్యాన్ చేసిన బజాజ్.. మరి ఆ స్థానములో వచ్చిన బైక్ ఏదో తెలుసా?

Pulsar 150 బైక్ ను బ్యాన్ చేసిన బజాజ్.. మరి ఆ స్థానములో వచ్చిన బైక్ ఏదో తెలుసా?

by Bunty
Ad

బజాజ్ కంపెనీ ఇప్పుడు చాలా బాగా నడుస్తోంది. ఈ కంపెనీ నుంచి విడుదల బైక్స్ బాగా డిమాండ్ ఉంది. అయితే, గత 20 సంవత్సరాలుగా మార్కెట్లో తిరుగులేని అమ్మకాలు పొందిన బజాజ్ ‘పల్సర్ 150’ ఇప్పుడు ఆశాజనకమైన అమ్మకాలు పొందలేకపోతోంది. దీనికి ప్రధాన కారణం మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త బైక్లు లేదా అప్డేటెడ్ బైకులు విడుదల కావడం అనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ‘పల్సర్ 150’ బ్యాన్ చేసింది బజాజ్ కంపెనీ. అయితే బజాజ్ కంపెనీ తమ పల్సర్ 150 ని నిలిపివేయడానికి ముందే కంపెనీ ఆ స్థానంలో ‘పల్సర్ పి 150’ తో భర్తీ చేసింది. ఈ బైకు ఇటీవలే దేశీయ మార్కెట్లో విడుదలైంది.

Advertisement

‘పల్సర్ పి 150’ విశేషాలు :

Advertisement

బజాజ్ పల్సర్ 150 స్థానంలో విడుదలైన ‘పల్సర్ పి 150’ విషయానికి వస్తే, దీని ధర రూ.1,16,755. ఈ కొత్త బైక్ సింగిల్ డిస్క్ మరియు ట్విన్ డిస్క్ వేరే అందుబాటులో ఉంటుంది. కొత్త పల్సర్ పి 150 బైక్ మంచి డిజైన్ కలిగి ఉంటుంది. ఈ డిజైన్ దాని మునుపటి మోడల్స్ ఎన్ 160 మరియు ఎన్ 250 నుంచి ప్రేరణ పొందడం జరిగింది.

బజాజ్ పల్సర్ పి 150 బైక్ 149 సిసి సింగిల్-సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజన్ పొందుతుంది. ఇది 8,500 ఆర్పిఎం వద్ద 14.5 హెచ్పి పవర్ మరియు 6,000 ఆర్పిఎం వద్ద 13.5 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ గేర్ బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. ఈ బైక్ యొక్క ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 14 లీటర్లు కాగా బరువు కేవలం 140 కేజీలు వరకు ఉంటుంది. కొత్త పల్సర్ పి 150 బైక్ 17 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ తో వస్తుంది. సస్పెన్షన్ మరియు బేకింగ్ సిస్టం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి :  ఆర్టీసీ నెంబర్ ప్లేట్‌పై ‘Z’ అక్షరం ఎందుకు ఉంటుందో తెలుసా?

Visitors Are Also Reading