Home » అఖండ సినిమా లో ఈ మిస్టేక్ గమనించారా ? చూసుకోవాలిగా బోయ పాటి గారు అంటూ ట్రోల్ల్స్ ..!

అఖండ సినిమా లో ఈ మిస్టేక్ గమనించారా ? చూసుకోవాలిగా బోయ పాటి గారు అంటూ ట్రోల్ల్స్ ..!

by AJAY
Ad

ఒకప్పుడు సినిమాలు తీసేటప్పుడు దర్శకులు పెద్దగా జాగ్రత్తగా లేకపోయినా సమస్యలు వచ్చేవి కావు. సినిమాల్లో చిన్నచిన్న మిస్టేక్స్ ఉన్నాకూడా ప్రేక్షకులు వాటిని చూసి చూడనట్టు వదిలేసేవారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. సినిమాలో చిన్న మిస్టేక్ చేసినా పసిగడుతున్నారు. ఆ మిస్టేక్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ట్రోల్స్ చేస్తున్నారు.

Advertisement

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రీసెంట్ గా తెరకెక్కిన అఖండ విషయంలోనూ అదే జరుగుతోంది. సింహా, లెజెండ్ లాంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత బోయపాటి బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన సినిమా అఖండ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. 50 రోజుల్లో 200 కోట్ల కలెక్షన్లు రాబట్టి బాలయ్య కెరీర్లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచిపోయింది.

Also read : పార్టీ సిద్దాంతాల‌ కోసం మంత్రులుగా ఉన్న భార్య‌భ‌ర్త‌లు విడిపోయారు!

Advertisement

Balayya

Balayya akhanda movie

ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేసి ప్రేక్షకులను మైమరపించారు. ముఖ్యంగా ఈ సినిమాలో బాలయ్య చేసిన పాత్రకు విమర్శకుల ప్రశంసలు అందాయి. ఈ పాత్ర బాలయ్య తప్ప మరెవరూ చేయలేరు అంటూ పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా ఓటిటిలో విడుదల కాగా అక్కడ కూడా అఖండ హవా కనిపిస్తోంది. అయితే ఇలాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో బోయపాటి ఓ చిన్న మిస్టేక్ చేసి అడ్డంగా దొరికిపోయాడు.

సినిమాలో ఫైట్ సీన్ జరిగే సందర్భంలో ఓ నటుడు విలన్ పక్కన గుండాగా కనిపించాడు.

అయితే అదే గుండాగా నటించిన నటుడు మళ్లీ పోలీస్ గా కనిపించాడు. ఒకే సినిమాలో బోయపాటి శ్రీను ఆ నటుడికి రెండు పాత్రలు ఇచ్చి దొరికిపోయాడు. దాంతో అక్కడ పోలీసు ఇక్కడ దొంగ అంటూ బోయపాటి పై నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు.

Also read : క‌బ‌డ్డీలో ఈ రూల్ తీసేస్తే బాగుంటుంది! మీ అభిప్రాయం?

Visitors Are Also Reading