సుమ కనకాల గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. యాంకరింగ్ అనే పదానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది సుమ. వేదిక ఏదైనా.. సందర్భానుసారంగా పదునైనా మాటలతో రక్తి కట్టిస్తోంది. చక్కని రూపం మాత్రమే కాక భాషపై అద్భుతమైన పట్టు, సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ.. ఏళ్ల తరబడి యాంకర్ గా విజయవంతంగా రాణిస్తోంది సుమ. తొలుత బుల్లితెర నటిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన సుమ.. ఆ తరువాత నెమ్మదిగా యాంకరింగ్ వైపు వచ్చింది. తొలుత పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ.. టాప్ యాంకర్ గా రాణిస్తోంది. ప్రస్తుతం ప్రీ రిలీజ్ ఈవెంట్స్ బుల్లితెర కార్యక్రమాలు, సినిమాల విడదలకు ముందు ప్రత్యేక ఇంటర్వ్యూలు వంటివి చేస్తూ.. టాలీవుడ్ లో టాప్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది సుమ. ఈ తరుణంలో గత కొద్ది రోజులుగా సుమకు సంబంధించి ఓ వార్త తెగ ప్రచారమవుతోంది. సుమ యాంకరింగ్ కి బ్రేకు ఇవ్వబోతుందనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై తాజాగా క్లారిటీ ఇచ్చింది సుమ.
Advertisement
Advertisement
డిసెంబర్ 31 సందర్భంగా ఈటీవీలో ప్రసారం కాబోయే ఓ ప్రత్యేక కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోని విడుదల చేసారు. సుమ ఎన్నో ఏళ్లుగా యాంకర్ గా రాణిస్తున్నానని.. కొద్ది రోజులు బ్రేక్ తీసుకోవాలని భావిస్తున్నట్టు చెబుతూ ఎమోషనల్ అయింది. దీంతో సుమ యాంకరింగ్ మానేస్తున్నట్టు మీడియాలో వార్తలు వచ్చాయి. ఇది కాస్త వైరల్ కావడంతో సుమ స్నేహితులు, సన్నిహితులు ఆమెకు కాల్ చేసి దీని గురించి ఆరా తీయడం ప్రారంభించారట. దీంతో ఈ వార్తలపై సుమ స్వయంగా స్పందించింది. తాను యాంకరింగ్ మానేస్తున్నట్టు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను ఖండించింది సుమ.
అలాంటిదేమీ లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు తన సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది సుమ. “మొత్తం ఈవెంట్ చూస్తే అసలు విషయం ఏంటో అర్థమవుతుంది. కంగారు పడకండి నాకు చాలా మంది ఫోన్ చేస్తున్నారు. ఎస్ఎంఎస్ లు చేస్తున్నారు. సో నేను ఒకటే చెప్పదలుచుకుంది ఏంటంటే.. నేను ఎటువెళ్లడం లేదు. కాబట్టి మీరు హాయిగా ఉండడి. మీ అందరికీ ముందుగానే నూతన సంవత్సర శుభాకాంక్షలు సుమ తాను యాంకరింగ్ వీడటం లేదు” అని క్లారిటీ ఇచ్చింది. అదేవిధంగా అందరికీ ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది సుమ.
Also Read : రోజా కూతురి ఫొటోలు మార్ఫింగ్.. కన్నీరు పెట్టుకున్న నటి