Telugu News » Blog » పవన్ కళ్యాణ్, చిరంజీవిలది ముఖ్యమంత్రి స్థాయి : కమెడియన్ పృథ్వీ రాజ్

పవన్ కళ్యాణ్, చిరంజీవిలది ముఖ్యమంత్రి స్థాయి : కమెడియన్ పృథ్వీ రాజ్

by Bunty
Ads

30 ఇయర్స్ పృథ్వీ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. 30 ఇయర్స్ ఇక్కడ అనే డైలాగ్ తో పృథ్వీరాజ్ ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. ఇండస్ట్రీలోకి వచ్చి ఏళ్ళు గడిచినా ఖడ్గం సినిమాతో పృథ్వి రాజ్ కు బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత వరుస సినిమాల్లో కామెడీయన్ గా నటించి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఇక ఇండస్ట్రీలో నటుడిగా ఫుల్ బిజీగా ఉన్న సమయంలో పృథ్వీరాజ్ వైసీపీలో చేరి రాజకీయాల్లో చురుకుగా వ్యవహరించాడు.

Advertisement

గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి తరఫున గడపగడపకు తిరిగి మరీ ప్రచారం చేశాడు. ఆ తర్వాత టీటీడీలో కీలక పదవి చేపట్టిన పృథ్వీ రాజ్‌.. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల వైసీపీకి రాజీనామా చేశాడు. ఇక ప్రస్తుతం జనసేనలో ఉన్న పృథ్వి, ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్, చిరంజీవి ఇద్దరిదీ సీఎం రేంజ్ అంటూ వారు మాట్లాడితే కోట్ల మంది వినడానికి సిద్ధంగా ఉంటారు అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

Advertisement

తను రాజకీయాల్లోకి వచ్చిన పదవులు గురించి ఆలోచించకపోవడం గురించి మాట్లాడుతూ, నేను పదవులు ఆశించి రాజకీయాల్లోకి రాలేదు అంటూ మాట్లాడారు. వైసీపీ పార్టీలో ప్రతిదీ సలహాదారులు ఇచ్చే స్క్రిప్ట్ ప్రకారం మీడియా ముందు మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉంటారు అంటూ పృథ్వీ విమర్శించారు. చంద్రబాబు అయితే వెన్నుపోటు, పవన్ అయితే మూడు పెళ్లిళ్లు అవి తప్ప మేము ఏమి చేసాము అనే విషయాలను ప్రజలకు మాత్రం చెప్పరు. ఏనాడు లైవ్ ప్రెస్ మీటింగ్ కానీ, మీడియా సమావేశాలు కానీ ఎక్కువగా జగన్ పెట్టరు అంటూ వైసీపీ వారి మీద విమర్శలు చేశారు పృథ్విరాజ్.

Advertisement

READ ALSO :  తెలంగాణ పోలీస్ ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్.. వాళ్లకు ఈవెంట్స్‌ లేవు.. డైరెక్ట్‌గా మెయిన్సే

You may also like