Home » ఆ 5 వేల మందికి అన్నం పెట్టడానికే నేను ఐపీఎల్ లో పని చేస్తున్న అంటున్న గంభీర్..!

ఆ 5 వేల మందికి అన్నం పెట్టడానికే నేను ఐపీఎల్ లో పని చేస్తున్న అంటున్న గంభీర్..!

by Azhar
Ad
భారత మాజీ ఓపెనర్… ఐపీఎల్ లో కోల్కతా నైట్ రైడర్స్ కు రెండుసార్లు టైటిల్ అందించిన కెప్టెన్ గౌతమ్ గంభీర్. అయితే టీం ఇండియాలో ఉన్నప్పుడు చాలా అగ్రెసివ్ ప్లేయర్ గా గంభీర్ పేరు తెచ్చుకున్నాడు. ఆ కారణంగానే అతను భారత జట్టులో స్థానం కోల్పోయాడు అని కూడా చాలా వార్తలు వచ్చాయి. అయిన వాటిని గంభీర్ పట్టుంచుకోలేదు. ఇక ఏ ప్రశ్నకు అయిన ముక్కుసూటిగా సమాధానం చెప్పే తత్వం గంభీర్ ది. ఇప్పుడు కూడా గంభీర్ అలంటి వ్యాఖ్యలే చేసాడు.
అయితే 2016 లో అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన గంభీర్ ఆ తర్వాత బీజేపీ తరపున ఢిల్లీ నుండి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించాడు.  అలా ఎంపీ గా గెలిచిన తర్వాత కూడా గంభీర్ క్రికెట్ తో ఐపీఎల్ తో తన సంబంధాని కొనసాగిస్తూనే వస్తున్నాడు. మొదట ఐపీఎల్ లో కామెంటేటర్ గా… విశ్లేషకునిగా పనిచేసిన గంభీర్ ఇప్పుడు ఐపీఎల్ 2022 లో లక్నో సూపర్ జెంట్స్ జట్టుకు మెంటార్ గా వ్యవరిస్తున్నాడు. దాంతో ఎంపీగా ఉండి ఇంకా ఐపీఎల్ లో కొనసాగడంతో గంభీర్ పై పలు విమర్శలు వచ్చాయి. తాజాగా ఆ విమర్శలకు మీడియా ద్వారా సమాధానం ఇచ్చాడు.
నేను ఇంకా ఐపీఎల్ లో కొనసాగడానికి ఓ కారణం ఉంది. నేను ఢిల్లీలో రోజు 5 వేల మందికి అన్నం పెడుతున్నాను. అలాగే 25 లక్షలతో లైబ్రెరీ కూడా నిర్మించాను. ఇక ఆ 5 వేల మంది కడుపు నింపడానికి నాకు నెలకు 25 లక్షల చొప్పున ఏడాదికి 3 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇదంతా నేను నా సొంత ఖర్చుతో చేస్తున్నాను. ఎంపీ ల్యాడ్ ఫండ్ నుంచి వచ్చే పైసలతోని అక్కడికి మసాలా కూడా కొనలేం. అందుకే నేను ఈ ఐపీఎల్ లో పని చేస్తూ డబ్బులు సంపాదించి వారి ఆకలి తిరుస్తున్నాను. కాబట్టి నా గురించి ఎవరు ఏం అనుకున్న నేను పెట్టించుకోను అని గంభీర్ పేర్కొన్నారు.

Advertisement

Visitors Are Also Reading