Home » శ్రీమంతుడు నుంచి బలగం వరకు కాపీ ఆరోపణలు ఎదుర్కొన్న చిత్రాలు ఇవే..!

శ్రీమంతుడు నుంచి బలగం వరకు కాపీ ఆరోపణలు ఎదుర్కొన్న చిత్రాలు ఇవే..!

by Anji
Ad

సాధారణంగా ‘నా కథ కాపీ కొట్టారని.. నా కథతోనే ఈ సినిమా తీశారని.. నాకు మత్రం క్రెడిట్ ఇవ్వలేదు’ అంటూ కొంత మంది మీడియా ముందుకు రావడం కొత్త విషయం ఏమి కాదు. గతంలో  కూడా పలు సందర్భాల్లో  ఇలాంటి ఆరోపణలు చాలానే విన్నాం. ఇప్పటికీ కూడా వింటూనే ఉన్నా. ఇటీవల బలగం అనే సినిమా విడుదలైన విషయం తెలిసిందే. జబర్దస్త్ కమెడియన్ వేణు ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. దిల్ రాజు తన చిన్న బ్యానర్ లో ఈ సినిమాని నిర్మించారు. పెద్ద రేంజ్ ల కలెక్షన్ల రాబట్టే సినిమా కాదు.. తన థియేటర్స్ లో దిల్ రాజు ఈ సినిమాని ఓన్ రిలీజ్ చేసుకున్నారు. బిజినెస్ కి తగ్గ కలెక్షన్లు రాబట్టి సేఫ్ అనిపించుకుంది. 

Also Read :  రజనీకాంత్ కు తల్లి లేని లోటు తీర్చిన ఆ మహిళ ఎవరంటే..?

Advertisement

 

‘ఈ చిత్రం యొక్క కథ నాదే అని.. గతంలో నేను మ్యాగిజైన్ కోసం రాసిన కథను సినిమాగా తీసి క్యాష్ చేసుకుంటున్నారు. నాకు క్రెడిట్ ఇవ్వడం లేదు అంటూ ఓ జర్నలిస్ట్ మీడియాని ఆశ్రయించాడు. నాకు న్యాయం జరగకపోతే కోర్టుకు వెళ్తాను అంటూ చిత్ర  బృందాన్ని హెచ్చరించాడు. ఈ కథ ఏ ఒక్కరిదీ కాదు.. తెలుగు వారి సంస్కృతి, సంప్రదాయంతో రూపొందించింది అంటూ దర్శకుడు వేణు ఆ జర్నలిస్ట్ కి సమాధానం చెప్పారు.ఓ సినిమా కథపై ఇలాంటి కాపీ ఆరోపణలు రావడం కొత్త విషయమేమి కాదు. గతంలో కూడా కొన్ని సినిమాల కథల విషయంలో కాపీ ఆరోపణలు అనేవి వ్యక్తమయ్యాయి. కొంతమంది డబ్బు కోసం, పబ్లిసిటికోసం కావాలని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నట్టు వార్తలు వినిపించాయి. ఇంతకీ బలగం తో పాటు కాపీ ఆరోపణలు ఎదుర్కొన్న సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.  

Also Read :  సోనాలి బింద్రే నుండి సమంత వరకు ప్రాణాంతక వ్యాధులతో పోరాడి గెలిచిన మహిళా నటీమణులు..!!

జబర్దస్త్  :

Manam News

సిద్దార్థ్, సమంత జంటగా నటించిన ఈ సినిమాకి నందినీ రెడ్డి దర్శకత్వం వహించారు. బెల్లంకొండ సురేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా కథ హిందీలో రూపొందించిన బ్యాండ్ బజా భారత్ ని పోలి ఉంటుంది. సైలెంట్ గా మా చిత్రాన్ని కాపీ కొట్టేశారు అంటూ యష్ రాజ్ ఫిలింస్ వారు కేసు వేశారు. ఆ సమయంలో బ్యాండ్ బజా భారత్ ని వాళ్లు తెలుగులో నానితో రీమెక్ చేస్తూ ఉన్నారు. నిర్మాత బెల్లంకొండ సురేష్ పై కూడా కేసు వేశారు. జబర్దస్త్ చిత్రం శాటిలైట్ హక్కులు ఎవ్వరికీ అమ్మకూడదని కోర్టు స్టే విదించింది. 

Also Read :  Women’s day: డైరెక్టర్లుగా రాణిస్తున్న మహిళ మణులు.. ఎవరో తెలుసా..?

పాండవులు పాండవులు తుమ్మెద :

Manam News

మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్ కాంబోలో వచ్చిన ఈ చిత్రానికి శ్రీవాస్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం యొక్క కథను హిందీలో రూపొందించిన గోల్ మాల్ 3 నుంచి కాపీ కొట్టారని వార్తలు వినిపించాయి. గోల్ మాల్ 3 నిర్మాతలు మంచు ఫ్యామిలీపై కేసు వేయగా.. న్యాయస్థానం నుంచి మంచు ఫ్యామిలీకి రూ.90 లక్షలు జరిమానా విధించారు. కొద్ది రోజుల పాటు పాండవులు, పాండవులు తుమ్మెద డబ్బింగ్ రైట్స్ ని అమ్మకూడదని స్టే విధించింది. 

Also Read :  ఇండస్ట్రీ హిట్ లాంటి ‘సమరసింహ రెడ్డి’ సినిమాలో ఒక్క సీన్ బాగోలేదని వదిలేసిన హీరోయిన్ ఎవరంటే ?

Advertisement

శ్రీమంతుడు :

Manam News

మహేష్ బాబు-కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమా కథ నాదే.. నారా రోహిత్ తో ఈ కథత సినిమా తీయాలనుకుంటే కొరటాల శివ నా కథను కాపీ కొట్టేసి సినిమా చేశారని శరత్ చంద్ర అనే వ్యక్తి తెలుగు రచయితల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఆ తరువాత కోర్టుకు కూడా వెళ్లారు. 

అఆ :

 

 

మీనా అనే నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందిందని.. క్రెడిట్స్ మాత్రం ఇవ్వలేదని అప్పట్లో ఈ సినిమా యూనిట్ పై ఫిర్యాదు చేశారు. 

అజ్ఞాతవాసి :

Manam News

లార్గోవించ్ అనే ఫ్రెంచ్ మూవీని ఆధారం చేసుకొని ఈ సినిమా తీసినట్టు ఈచిత్రం యొక్క నిర్మాతలు వీరిపై కేసు వేశారు. ఆ తర్వాత రూ.20కోట్ల వరకు ఫైన్ వేశారు. ఆ తర్వాత రాజీ కుదుర్చుకొని కట్టలేదని సమాచారం. అజ్ఞాతవాసి చిత్రం బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. 

నిను వీడని నీడను నేనే : 

Manam News

సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ సినిమా ఓ షార్ట్ ఫిలిం నుంచి కాపీ కొట్టారని.. సినిమా విడుదల రోజునే ఆరోపణలు వినిపించాయి. ఆ తరువాత ఆ కథ వేరు.. ఈ కథ వేరు అని లైట్ తీసుకున్నారు. 

ఇస్మార్ట్ శంకర్ :

Manam News

ఒకప్పటి హీరో ఆకాశ్ తీసిన కొత్తగా ఉన్నాడు అనే చిత్రాన్ని కాపీ కొట్టి పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ తీశాడని అతను మీడియాకెక్కాడు. ఆ తరువాత ఏమైందో ఏమో సైలెంట్ అయిపోయాడు. 

ఆచార్య : 

Manam News

ఈ చిత్రం విడుదల కాకుండానే కథ నాది. కొరటాల శివ కాపీ కొట్టేశాడు అని ఓ వ్యక్తి ఆరోపణలు చేశాడు. ఇక ఆ తరువాత సైలెంట్ అయిపోయాడు. గత ఏడాది విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. 

క్రాక్ : 

Manam News

తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా రూపొందన సేతుపతి రైట్స్ తాను కొనుగోలు చేస్తే.. విలన్ క్యారెక్టర్ ని మార్చేసి క్రాక్ గా తీశాడు దర్శకుడు గోపిచంద్ మలినేని అంటూ సీనియర్ నిర్మాత సి.కళ్యాణ్ ఆరోపించాడు. 

రైటర్ పద్మభూషణ్ : 

Manam News

ఇటీవలే సుహాస్ హీరోగా వచ్చిన చిత్రం రైటర్ పద్మభూషణ్. బరేలీ బర్ఫి అనే బాలీవుడ్ సినిమాని కాపీ కొట్టి ఈ చిత్రాన్ని రూపొందించినట్టు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. 

బలగం :

Manam News

తాజాగా విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ లభిస్తోంది. అయితే ఈ చిత్రం యొక్క కథ నాది అంటూ ఇటీవల ఓ జర్నలిస్ట్ మీడియా ముందుకొచ్చి ఆరోపణలు చేశారు. 

Also Read  :  శోభన్ బాబు ఆస్తుల విలువ ఎంతో తెలుసా.. ఇప్పటి తరం హీరోలు కూడా అందుకోలేరు..!!

Visitors Are Also Reading