Home » ఇండస్ట్రీ హిట్ లాంటి ‘సమరసింహ రెడ్డి’ సినిమాలో ఒక్క సీన్ బాగోలేదని వదిలేసిన హీరోయిన్ ఎవరంటే ?

ఇండస్ట్రీ హిట్ లాంటి ‘సమరసింహ రెడ్డి’ సినిమాలో ఒక్క సీన్ బాగోలేదని వదిలేసిన హీరోయిన్ ఎవరంటే ?

by AJAY
Ad

ఇప్పుడు బాలయ్య బోయపాటి కాంబినేషన్ అంటే ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఒకప్పుడు బాలయ్య బి.గోపాల్ కాంబినేషన్ కు ఇంతకుమించిన క్రేజ్ ఉండేది. వీరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ గా నిలవడమే దానికి కారణం. వీరిద్దరి కాంబోలో వరుసగా వచ్చిన లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్ సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. దాంతో ఆ తర్వాత వచ్చే సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

samarasimhareddy

Advertisement

 

దాంతో కథ విషయంలో బి.గోపాల్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. ఇక మూడో సినిమా కోసం కథా రచయిత విజయేంద్రప్రసాద్ వద్దకు వెళ్లగా ఆయన 30 కథలను వినిపించగా అందులో సమరసింహారెడ్డి కథను బి.గోపాల్ ఫైనల్ చేశారు. ఇక ఆ సమయంలో ఫ్యామిలీ మూవీస్ హవా కొనసాగుతోంది. అలాంటి టైంలో బి.గోపాల్ సమరసింహా రెడ్డి లాంటి యాక్షన్ సినిమా వచ్చింది. 1999 సంక్రాంతికి ఈ సినిమా విడుదలై రికార్డులు బద్దలు కొట్టింది. ఈ సినిమాకు కలెక్షన్ల వర్షం కురిసింది.

Advertisement

ఇక ఈ సినిమా విడుదలై జనవరి 13కు 23 ఏళ్లు పూర్తి చేసుకుంది. అయితే ఈ చిత్రానికి ముందుగా సమరసింహం అనే టైటిల్ ని అనుకున్నారట. కానీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ సలహా మేరకు ఈ సినిమాకు సమరసింహారెడ్డి అనే టైటిల్ ని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇక ఈ చిత్రానికి మణిశర్మ స్వరాలు సమకూర్చారు. బాలయ్య సినిమాకు మణిశర్మ మ్యూజిక్ అందించడం ఇదే మొదటిసారి.

ఇదిలా ఉంటే బాలయ్య బి.గోపాల్ కాంబినేషన్ అంటే ఎంతో క్రేజ్ ఉన్నప్పటికీ ఒక హీరోయిన్ మాత్రం ఈ సినిమాలోని ఓ సీన్ వద్దని చెప్పి సినిమా నుండే తప్పుకుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు అందాల ముద్దు గుమ్మ రాశి. ఈ చిత్రంలో సీతాకోకచిలక సీన్ రాశి ఒప్పుకోలేదు… దాంతో ఆమె ప్లేస్లో హీరోయిన్ గా సిమ్రాన్ ను తీసుకున్నారు. ఇక సంక్రాంతికి విడుదల చేసిన ఈ సినిమాకు ఆరు కోట్ల బడ్జెట్ ను కేటాయించగా 16 కోట్ల కలెక్షన్ వచ్చాయి.

Also read : ఇద్దరూ మళ్లీ కలుస్తారు…. దీప్తితో బ్రేకప్ పై స్పందించిన షణ్ముక్ తండ్రి…!

Visitors Are Also Reading