Home » రిపబ్లిక్ డే వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు.. రెండు రోజులు ఇండియా లో..!

రిపబ్లిక్ డే వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు.. రెండు రోజులు ఇండియా లో..!

by Sravya
Ad

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మక్రాన్ భారత్ కి గురువారం నాడు రాబోతున్నారు. రిపబ్లిక్ డే పరేడ్ కి మక్రాన్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. కవాతులు రెండు రాఫెల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ వైమానిక దళానికి చెందిన ఎయిర్బస్ A330 మల్టీ రోల్ ట్యాంకర్ విమానాలు కూడా ఉన్నాయి. ఫ్రాన్స్ కి చెందిన 95 మంది సభ్యులు మార్చింగ్స్ స్క్వాడ్ తో పాటుగా 33 మంది సభ్యుల బ్యాండ్ స్క్వాడ్ కవాతులో పాల్గొనబోతున్నాయి.

Advertisement

Advertisement

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్ రేపు జైపూర్ విమానాశ్రయానికి చేరుకోబోతున్నారు జంతర్ మంతర్, ఆమిర్ ఫోర్ట్, హవా మహల్ ని సందర్శించబోతున్నారు. జైపూర్ లో ప్రధాని నరేంద్ర మోడీని ఆయన కలవబోతున్నారు. తర్వాత అర్ధరాత్రి ఢిల్లీ చేరుకుంటారు. జనవరి 26న రిపబ్లిక్ డే పరేడ్ కి అధ్యక్షుడు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. సాయంత్రం రాష్ట్రపతి భవన్ లో భారత రాష్ట్రపతి ఇచ్చే అట్ హోమ్ రిసెప్షన్లో పాల్గొనబోతున్నారు. ముందు అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ని ముఖ్య అతిథిగా తీసుకురావాలని భారత ప్రభుత్వం ఆహ్వానించింది కానీ నిరాకరించడంతో చివరి క్షణంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయనని తీసుకువస్తున్నారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading