Home » రోహిత్ శర్మపై టీమిండియా ఆ మాజీ ఓపెనర్ సెటైర్.. మామూలుగా లేదుగా..!

రోహిత్ శర్మపై టీమిండియా ఆ మాజీ ఓపెనర్ సెటైర్.. మామూలుగా లేదుగా..!

by Anji
Ad

ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అలియాస్ ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లో గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. ఈ సీజన్ లో అత్యంత చెత్త రికార్డును నెలకొల్పాడు హిట్ మ్యాన్. ఐపీఎల్ తన కెరీర్ లోనే మొత్తం 16 సార్లు డక్ అవుట్ అయి అందరికంటే టాప్ ప్లేస్ ని సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా రోహిత్ శర్మ ఆట తీరు గురించి అతని టాలెంట్ గురించి ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అతను ఎంత మేరకు రాణించగలరు ? అతని సామర్థ్యం ఏమిటి ? అనే ప్రశ్నలకు సమాధానాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు తెలుసు. కానీ రోహిత్ శర్మ ఈ విషయంలో టీమిండియా మాజీ ఓపెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు.  

Also Read :  ఆ ఒక్క కారణంతోనే అనసూయ విజయ్ ని ట్రోల్ చేస్తుందా…?

Advertisement

సాధారణంగా ఏ క్రికెటర్ అయినా తన కెరీర్ లో కొంత మేరకు ఫామ్ లేమినీ ఎదుర్కొంటాడు. ఇప్పుడు ఐపీఎల్ లో రోహిత్ శర్మ కాస్త ఇబ్బంది పడుతున్నాడు. పరుగులు చేయకుండానే డక్ అవుట్ అవుతూ పెవిలియన్ కి చేరుతున్నాడు. అక్కడికి అతను ఆర్డర్ మార్చుకొని మైదానంలోకి దిగుతున్నప్పటికీ డక్ ఔట్లు మాత్రం అతన్ని వదలడం లేదు. శనివారం చెన్నై సూపర్ కింగ్స్ జరిగిన మ్యాచ్లో కూడా రోహిత్ శర్మ డక్ ఔట్ తో ఫెవిలియన్ చేరాడు. ఆ సమయంలో కామెంటరీ బాక్స్ లో ఉన్న టీమ్ ఇండియా మాజీ ఓపెన్ ఆర్ కృష్ణమాచారి శ్రీకాంత్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు.  అతని కామెంట్స్ పై హిట్ మ్యాన్ ఫ్యాన్స్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.  

Advertisement

Also Read :  Sr. NTR, Jr. NTR పెళ్లి పత్రికల్లో ఆ ఒక్కటి గమనించారా.. తెలిస్తే షాకవుతారు..!!

Rohith

రోహిత్ శర్మకు శ్రీకాంత్ సారీ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ.. రోహిత్ శర్మ తన పేరుని నోహిట్ మ్యాన్ గా మార్చుకోవాలని కోరారు. ఆగకుండా తానైతే రోహిత్ శర్మ జట్టులోకి కూడా తీసుకోని చెప్పుకొచ్చారు. శ్రీకాంత్ చేసిన ఈ వ్యాఖ్యలపై రోహిత్ శర్మ ఫ్యాన్స్ అభ్యంతర వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా మాజీ ఓపెనర్ గా భారత జట్టు కెప్టెన్ కి ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. రోహిత్ పర్ఫార్మెన్స్ చూస్తే ఈ సీజన్లో ఆడిన పది మ్యాచ్ లలో 184 పరుగులు మాత్రమే చేశాడు. చెన్నై పై డక్ ఔట్ అయిన వారిలో సునీల్ నరైన్ (15), మనుదీప్ సింగ్ (15), దినేష్ కార్తీక్ (15)లను దాటి రోహిత్ శర్మ 16 సార్లు డక్ అవుట్ అయి చెత్త రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. 

Also Read :   Rajinikanth:మీనాలో అది చూసి షాకయ్యాను..!

Visitors Are Also Reading