Home » రీ-ఎంట్రీ ఇస్తా అంటున్న పాక్ పేసర్ మహమ్మద్ అమీర్…!

రీ-ఎంట్రీ ఇస్తా అంటున్న పాక్ పేసర్ మహమ్మద్ అమీర్…!

by Azhar
Ad

పాకిస్థాన్ జట్టులో కీలక ఆటగాడిగా… బౌలర్ గా సేవలు అనేవి అందించిన మహమ్మద్ అమీర్.. అందరికి షాక్ ఇస్తూ 2020 లో అంతర్జాతీయ క్రికెట్ నుండి తప్పుకున్నాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డుతో తనకు వచ్చిన విబేధాల కారణంగానే తాను ఈ వీడ్కోలు అనేది పలుకుతున్నాను అని మహమ్మద్ అమీర్ పేర్కొన్నాడు. అయితే క్రికెట్ కెరియర్ అనేది ప్రారంభించిన కొత్తలోనే… బుకీలతో కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాడు మహమ్మద్ అమీర్. అందువల్ల అతడిని ఐదేళ్లు క్రికెట్ నుండి బ్యాన్ చేసారు. కానీ ఆ తర్వాత మళ్ళీ జట్టులోకి వచ్చి తన సత్తా నిరూపించుకున్నాడు.

Advertisement

2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ అనేది పాకిస్థాన్ చేతిలో ఓడిపోవడం ఏ భారతీయుడు మర్చిపోయాడు. ఆ మ్యాచ్ లో మన ఓటమిలో కీలకపాత్ర పోషించింది మహమ్మద్ అమీర్. అయితే ఇప్పుడు క్లబ్ క్రికెట్ అనేది ఆడుతున్న అమీర్ తాజాగా తన రీ ఎంట్రీ గురించి కామెంట్స్ చేసాడు. ” నా రిటర్మెంట్ అనేది వెన్నకి తీసుకొని..పాకిస్థాన్ జట్టు తరపున ఆడాలి అనే కోరిక నాకు ఉంది. కానీ ఇప్పుడు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మెన్ గా ఉన్న రమీజ్ రాజా వల్ల నేను రావడం లేదు. మా ఇద్దరి మధ్య ఇప్పుడు చాలా విబేధాలు వచ్చాయి. అతను నా గురించి ఎలా ఆలోచిస్తాడో నాకు తెలుసు.

Advertisement

అందువల్ల రమీజ్ రాజా ఆ స్థానంలో ఉన్నాని రోజులు నేను నా రిటైర్మెంట్ అనేది వెనక్కి తీసుకోను అని మహమ్మద్ అమీర్ తెలిపాడు. అలాగే నేను ఎప్పుడు ఐసీసీ ర్యాంకింగ్స్ లను పట్టించుకోను. అలాగే అందులో ఉన్నవారే బెస్ట్ బౌలర్లు అని నేను నమ్మను. నేను కూడా రిటైర్మెంట్ అనేది ఇచ్చిన తర్వాత కూడా చాలా కాలం ఐసీసీ ర్యాంకింగ్స్ లో టాప్ లో ఉన్నాను అని మహమ్మద్ అమీర్ చెప్పాడు. అలాగే నేను ఇప్పుడు అయితే టెస్ట్ క్రికెట్ ఆడాలని అనుకోవడం లేదు. సమయాన్ని బట్టి చూస్తాను. ప్రస్తుతం నేను ఆడుతున్న క్లబ్ క్రికెట్ అనేది నాకు సంతృప్తిని ఇస్తుంది అని మహమ్మద్ అమీర్ తెలిపాడు.

ఇవి కూడా చదవండి :

ఐపీఎల్ పెంపుపై ఐసీసీ వద్ద పాక్ బోర్డు ఏడుపు..!

బుమ్రా స్థానంలో సిరాజ్ ఎందుకు తుది జట్టులోకి వచ్చాడో తెలుసా..?

 

Visitors Are Also Reading