Home » పెళ్లికి ముందు తండ్రి కొడుక్కి నేర్పించాల్సిన 4 విష‌యాలు..2వ‌ది ఇంపార్టెంట్!

పెళ్లికి ముందు తండ్రి కొడుక్కి నేర్పించాల్సిన 4 విష‌యాలు..2వ‌ది ఇంపార్టెంట్!

by AJAY
Ad

ఒక‌ప్పుడు తల్లి దండ్రుల వ‌ద్ద‌నే పిల్ల‌లు కూడా ఉండేవారు. కానీ ప్ర‌స్తుతం పిల్ల‌లు చ‌దువుల కోసం ఉద్యోగాల కోసం తల్లి దండ్ర‌లకు దూరంగా ఉంటున్నారు. అయితే పిల్ల‌లు దూరంగా ఉంటే విద్య నేర్చుకుంటారు ఎలా బ్ర‌త‌కాలో నేర్చుకుంటారు కానీ విలువ‌లు నేర్చుకోవ‌డం క‌ష్ట‌మే. కాబ‌ట్టి త‌ల్లి దండ్రులు త‌మ పిల్ల‌ల‌కు వీలైన‌ప్పుడ‌ల్లా ఇత‌రుల‌తో ఎలా ఉండాలి. ఎలాంటి విలువ‌లు పాటించాలి అనేవి నేర్పించాలి.

ALSO READ :“సమర సింహారెడ్డి” లో నటించిన ఈ అమ్మాయి రామ్ చరణ్ కి ఏమి అవుతుందో తెలుసా…!

Advertisement

ముఖ్యంగా త‌ల్లి దండ్ర‌లు త‌మ పిల్ల‌లు పెళ్లికి ఎదిగిన త‌ర‌వాత జీవిత భాగస్వామితో ఎలా ఉండాలి. సంసార సాగ‌రాన్ని ఎలా ఈదాలి అనే విష‌యాలు కూడా ఖ‌చ్చితంగా నేర్పించాలి. ముఖ్యంగా పెళ్లి త‌ర‌వాత భ‌ర్త‌తో ఎలా ఉండాలో త‌ల్లి కూతురుకు నేర్పిస్తే పెళ్లి త‌ర‌వాత భార్య‌తో ఎలా ఉండాలి అత్తామామ‌లతో ఎలా కలిసి మెలిసి ఉండాల‌నే విష‌యాల‌ను తండ్రి కొడుకుకు వివ‌రించాలి.

Advertisement

ఏ బంధంలో అయినా గౌర‌వం ఇవ్వాలి. కాబ‌ట్టి భార్య‌కు గౌర‌వం ఇవ్వాలని తండ్రి కొడుకుకు క‌చ్చితంగా నేర్పించాలి. అంతేకాకుండా నిజాయితీగా ఉండ‌టం కూడా తండ్రి కొడుకుకు నేర్పించాలి. బంధంలో నిజాయితీ కూడా ముఖ్యం. నిజాయితీ లేన‌ట్ట‌యితే ఆ బంధం నిల‌బ‌డ‌దు కాబట్టి తండ్రి కొడుక్కి నేర్పించాలి.

గొడ‌వ‌లు జ‌రిగినప్పుడు రాజీ ప‌డాల‌ని చెప్పాలి. అలా చెప్ప‌డం వ‌ల్ల గొడ‌వ‌ల జ‌రిగిన‌ప్పుడు ఆ గొడ‌వ పెద్ద‌ది కాకుండా ఉంటుంది. అంతే కాకుండా స‌ర్దుకుపోవాల‌ని కూడా తండ్రి కొడుక్కి చెప్పాల‌ట‌. కుటుంబం అన్న త‌ర‌వాత గొడ‌వ‌లు కామ‌న్ కాబ‌ట్టి చిన్న చిన్న త‌ప్పుల‌ను క్ష‌మిస్తూ కాపురంలో స‌ర్దుకుపోవాల‌ని తండ్రి త‌న కొడుక్కి ముందుగానే చెప్పాలి.

ALSO READ  : జగన్ కు బాలయ్య మాస్ వార్నింగ్… సైకో ప్రభుత్వానికి చమరగీతం పాడాలని పిలుపు…

Visitors Are Also Reading