Home » బాలయ్య హీరో అంటే నవ్వుకున్నా.. మాజీ సీఎం కామెంట్స్..!

బాలయ్య హీరో అంటే నవ్వుకున్నా.. మాజీ సీఎం కామెంట్స్..!

by Anji
Ad

నందమూరి నటసింహం బాలకృష్ణ  ఏ రంగంలోకి ఎంట్రి ఇచ్చినా దాదాపు సక్సెస్ సాదిస్తారని సినీ ఇండస్ట్రీలో ఓ టాక్  ఉంది. అన్ స్టాపబుల్ సీజన్ 1 ని ఊహించని రేంజ్ లో సక్సెస్ చేశారు బాలకృష్ణ . ఇక రెండో సీజన్ ని సక్సెస్ చేయడం గ్యారంటీ అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ నెల 25న ప్రసారం అయ్యే ఎపిసోడ్ కి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, రాధిక గెస్టులుగా హాజరవుతున్నారు.

Advertisement

ఇటీవలే ప్రోమో విడుదలైన విషయం తెలిసిందే. కిరణ్ కుమార్ రెడ్డి ఓ సందర్భంలో బాలయ్య గురించి చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో బాలయ్య నాకు కామన్ ఫ్రెండ్ అని కిరణ్ కుమార్ చెప్పుకొచ్చారు. ఇద్దరి మధ్య మంచి స్నేహముండేదని, బాలయ్య యాక్టింగ్ లోకి వస్తారని ఎప్పుడూ అనుకోలేదని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పుకొచ్చారు. బాలయ్య యాక్టింగ్ ని అంత సీరియస్ గా తీసుకుంటాడని నేను భావించలేదని ఆయన చెప్పుకొచ్చారు. బాలయ్య జాలీ పర్సన్ అని నవ్వుతూ.. నవ్విస్తూ ఉండేవారని కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. బాలయ్య హీరో అంటే నవ్వుకున్నామని కిరణ్ కుమార్ రెడ్డి పరోక్షంగా తెలిపారు. 

Advertisement

Also Read :   చిరంజీవి,బాలయ్య ఒకే సాంగ్ లో కనిపించిన సినిమా.. ఆ ఒక్కటి చాలా స్పెషల్..!!

Balaiah

ఇక అప్పట్లో బాలకృష్ణలో హీరో లుక్స్ లేకపోవడంతో అలా అనిపించిందని చెప్పుకొచ్చారు. అదేవిధంగా తాను రాజకీయాల్లోకి రావడం తన భార్యకి ఇష్టం లేదని వెల్లడించారు. తల్లి కోరిక మేరకు నేను రాజకీయాల్లోకి వచ్చానని కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. నాన్న మరణించిన తరువాత ఓటర్ల నుంచి వచ్చిన కోరిక మేరకు రాజకీయాల్లోకి వచ్చానని కిరణ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. తొలుత పార్లమెంట్ స్థానం ఇస్తామని చెప్పినప్పటికీ.. తనకు అసెంబ్లీ స్థానం కావాలని కోరినట్టు చెప్పుకొచ్చారు.  కాంగ్రెస్ లో యంగెస్ట్ ఎమ్మెల్యే అని కిరణ్ కుమార్ రెడ్డి కామెంట్స్ చేశారు. గ్రూపు రాజకీయాలకు తాను దూరంగా ఉండేవాడినని వెల్లడించారు. 

Also Read :  కాంతార తరువాత సప్తమి గౌడ నటిస్తున్న సినిమా ఏదో తెలుసా ?

Visitors Are Also Reading