Home » కాంతార తరువాత సప్తమి గౌడ నటిస్తున్న సినిమా ఏదో తెలుసా ?

కాంతార తరువాత సప్తమి గౌడ నటిస్తున్న సినిమా ఏదో తెలుసా ?

by Anji
Ad

ఇటీవల వచ్చిన కాంతార సినిమా ఎంతటి సంచలన విజయం సాదించిందో అందరికీ తెలిసిందే. కాంతార సినిమాతో ఒక్కసారిగా స్టార్ అయిపోయింది అందాల తార సప్తమి గౌడ. కాంతార సినిమా హిట్ తో పాన్ ఇండియాలో ఫేమస్ అయిపోయింది. ఈమె పాత్ర చాలా చిన్నదే అయినప్పటికీ ప్రేక్షకుల మనుసులో చోటు సంపాదించుకుంది. నేచర్ బ్యూటీ సప్తమి గౌడ కూడా  కాంతారలో ఒక హైలెట్ అనే చెప్పాలి. 

Advertisement

ఇటీవల ఈ బ్యూటీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మరింత పాపులర్ అయిపోయింది. హిట్ సినిమాలతో ఇతర భాషల్లో అవకాశాలు వస్తున్నాయి. కాంతార సినిమా తరువాత ఈ చిన్నదానికి ఆఫర్లు క్యూ కడుతున్నాయి. తెలుగు నుంచి కూడా ఈ బ్యూటీకి ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది. 

Advertisement

KANTARA BEATY : MANAM News

తాజాగా ఈ హీరోయిన్ 1990 కాలం నాటి ఓ ప్రేమ కథలో నటిస్తోందని టాక్ వినిపిస్తోంది. ఇందులో ప్రముఖ నటుడు అంబ్రీష్ తనయుడు అభిషేక్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో సప్తమి గౌడ హీరోతో ఘాటైన రొమాంటిక్ సన్నివేశాల్లో మెప్పించబోతుందట. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. కాంతార సినిమా తరువాత ఇప్పుడు రొమాంటిక్ మూవీతో వస్తున్న సప్తమి ఎలాంటి హిట్ అందుకుందో.. ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో వేచి చూడాలి మరి. 

Also Read :  చిరు,బాలయ్య మధ్యలో ఉన్న ఈ పిల్లాడు ఎవరో చెప్పుకోండి..!!

Visitors Are Also Reading