Home » బొద్దింకలు ఎక్కువగా ఉన్నాయా..? ఇలా చేస్తే.. పారిపోతాయి..!

బొద్దింకలు ఎక్కువగా ఉన్నాయా..? ఇలా చేస్తే.. పారిపోతాయి..!

by Sravya
Ad

మీ ఇంట్లో బొద్దింకలు ఎక్కువగా ఉన్నాయా.. బొద్దింకల వలన ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇలా చేయండి. ఇలా చేస్తే బొద్దింకలు పారిపోతాయి. మీ ఇంట్లో ఉండవు. ఇంట్లోకి దోమలు, చీమలు, బొద్దింకలు లేదంటే బల్లులు, చిన్న చిన్న పురుగులు ఎక్కువగా వస్తూ ఉంటాయి. మొక్కలు ఉంటే చాలు ఈజీగా ఇటువంటివి వచ్చేస్తూ ఉంటాయి వీటిని తరిమి కొట్టడానికి చాలామంది రకరకాల కెమికల్స్ ని వాడుతూ ఉంటారు. కానీ సహజంగా ఈ నూనె వాడి వాటిని తరిమి కొట్టొచ్చు. మరి ఎలా మనం బొద్దింకలని తరిమి కొట్టొచ్చు అనేది చూద్దాం.

Advertisement

Advertisement

వేప నూనె ఇందుకు బాగా పనిచేస్తుంది. వేప నూనెతో దోమలు ని పోగట్టవచ్చు. పావు లీటర్ నీటిలో ఒక చెంచా వేప నూనె అర చెంచా వంట సోడాని వేసి పావుగంట అలా వదిలేసి ఆ తర్వాత స్ప్రే చేస్తే బొద్దింకలు, దోమలు, పురుగులు ఇలాంటివి ఏమీ కూడా ఉండవు. ఆవ నూనె కూడా ఇందుకు బాగా పనిచేస్తుంది. బొద్దింకలు పోవాలంటే పావు కప్పు ఆవ నూనెలో పుదీనా ఆకులు వేసి మరిగించి వడకట్టేసి ఒక సీసాలో దీనిని స్ప్రే చేశారంటే బొద్దింకలు పోతాయి. పెప్పెర్మింట్ ఆయిల్ కూడా ఇందుకు బాగా పనిచేస్తుంది పెప్పర్మెంట్ ఆయిల్ లో కొంచెం ఉప్పు వేసి స్ప్రే బాటిల్ లో వేసి స్ప్రే చేస్తే బొద్దింకలు పోతాయి.

Also read:

Visitors Are Also Reading