Home » ఏసీ వాడకంలో ఈ టిప్స్ పాటిస్తే కరెంట్ బిల్ తక్కువ వస్తుంది!

ఏసీ వాడకంలో ఈ టిప్స్ పాటిస్తే కరెంట్ బిల్ తక్కువ వస్తుంది!

by Bunty
Ad

ఎండలు మండిపోతున్నాయి. హైదరాబాద్ తో పాటు తెలంగాణ, ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 గంటలకే బానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. అయితే ఎండలు మరింత ముదిరే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత వారంలో గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ కు చేరుకునే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

Advertisement

ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది. ఈ తరుణంలోనే చాలామంది ఏసీలు విపరీతంగా వాడుతున్నారు. ఈ క్రమంలో నిత్యం ఏసీలను వాడటం వల్ల కరెంటు బిల్లు వాచిపోతుంది. అయితే కరెంట్ బిల్లు ఎక్కువగా రాకూడదంటే ఇప్పటినుండి ఈ చిట్కాలను పాటిస్తే కరెంట్ బిల్లును తగ్గించుకోవచ్చు. ఏసీ ఆఫ్ చేసేటప్పుడు రిమోట్ తో ఆఫ్ చేయడంతో పాటు పవర్ బటన్ ను కూడా ఆఫ్ చేయాలి.

Advertisement

రెండింటిని ఆఫ్ చేసి ఉంచితే బిల్లు తక్కువ వచ్చే అవకాశం ఉంది. ఏసీలను తక్కువ టెంపరేచర్ పెట్టి వాడకూడదు. 24 డిగ్రీల వద్ద పెట్టి వాడటం వల్ల కరెంటు బిల్లు తక్కువగా వస్తుంది. అలాగే రాత్రి పడుకునే ముందు ఏసీలో టైమర్ ను సెట్ చేసి పెట్టాలి. అలా చేస్తే రూమ్ చల్లబడిన వెంటనే ఏసీ దానంతట అదే ఆగిపోతుంది. దీంతో కరెంట్ అదా అవుతుంది. ఏసీని కొన్ని రోజుల తర్వాత కచ్చితంగా సర్వీసింగ్ చేయించాలి.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

Sunisith : ఉపాసన తో గోవాకు సునిశిత్…చితక్కొట్టిన మెగా ఫ్యాన్స్‌!

కాంగ్రెస్‌ లోకి మళ్లీ రానున్న కోమటి రెడ్డి రాజగోపాల్‌..క్లారిటీ ఇదే

IPL 2023 : ధోని ఆటోగ్రాఫ్‌ తీసుకున్న గవాస్కర్..ఫోటో వైరల్

Visitors Are Also Reading