మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన చరణ్ ఒక్కో మెట్టు పైకి ఎక్కి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయారు. ఇటీవలే దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించి భారీ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం తమిళ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఓ పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు రామ్ చరణ్.
ఇదిలా ఉండగా.. రామ్ చరణ్ హీరోగా నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చిత్రం ‘గోవిందుడు అందరివాడేలే’. ఈ సినిమా 2014లో దసరా కానుకగాప్రేక్షకుల ముందుకు వచ్చింది.పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకాంపై బండ్ల గణేష్ నిర్మాణంలో కృష్ణవంశీ దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రంలో రామ్ చరణ్, శ్రీకాంత్, కాజల్ అగర్వాల్, కమలినీ ముఖర్జీ వంటి తదితర తారాగణం నటించారు. క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన ఈ సినిమా విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో రామ్ చరణ్ చెల్లిలి పాత్రలో నటించిన ఆ అమ్ముడు ఎవరో మీకు తెలుసా..?
ఆమె పేరు అయేషా కాదుస్కర్. ఈమె చూడడానికి అచ్చం తెలుగు అమ్మాయిలాగానే ఉంటుంది. కానీ తెలుగు అమ్మాయి కాదు.. ముంబైకి చెందిన నటి. 2012లో హృతిక్ రోషన్ నటించిన ‘అగ్నిపథ్’ లో అయేషా నటించింది. ఇక ఆ తరువాత 2014లో గోవిందుడు అందరివాడులే చిత్రంలో నటించింది. బాలీవుడ్ సినిమాలు చేస్తూ వస్తోంది. ఇటీవల ఆయుష్మాన్ ఖురానా నటించిన డాక్టర్ జీ చిత్రంలో కూడా నటించింది. అయేషా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గానే ఉంటుంది. నిత్యం ఏదో ఒక ఫోటోను షేర్ చేసి అభిమానులను ఆకట్టుకుంటోంది అయేషా.
Also Read : అనుపమలో ఉన్న మైనస్ లు ఇవేనా.. అందుకే కెరీర్ దెబ్బతిందా..?