Home » అనుపమలో ఉన్న మైనస్ లు ఇవేనా.. అందుకే కెరీర్ దెబ్బతిందా..?

అనుపమలో ఉన్న మైనస్ లు ఇవేనా.. అందుకే కెరీర్ దెబ్బతిందా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ప్రేమమ్ మూవీతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు అనుపమ పరమేశ్వరన్. ఈ సినిమా మంచి హిట్ సాధించింది. దీంతో ఈ అమ్మడుకు మలయాళ మూవీ జేమ్స్ మరియు అలైస్ లో అవకాశం దక్కింది. ఈ సినిమా తర్వాత మళ్లీ తెలుగులో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చినటువంటి అ.. ఆ మూవీ లో అవకాశం వచ్చింది. ఇందులో సమంత మరియు నితిన్ జంటగా నటించగా సెకండ్ లీడ్ క్యారెక్టర్ లో అనుపమ చేసింది. నెగిటివ్ పాత్ర అయినా సరే చాలా బాగా ఆకట్టుకుంది. అలాగే మలయాళం నుంచి తెలుగులోకి రీమేక్ అయినా ప్రేమమ్ మూవీ లో నాగచైతన్య జోడీగా నటించింది. దీంతో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ పరమేశ్వరునికి అవకాశం కల్పించారు. 2017 జనవరిలో విడుదలైన టువంటి శతమానంభవతి మూవీ లో శర్వానంద్ తో జంటగా నటించింది. ఈ సినిమా కూడా విజయవంతం అవడంతో ఇక వరుస ఆఫర్లతో దూసుకుపోతూ ఎన్నో సినిమాలకు సైన్ చేసింది. ఇలా తెలుగులో చేస్తూనే తమిళ్ లో ధనుష్ జంటగా “కోడి” సినిమాలో నటించింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో చాలా బిజీ అయిపోయింది అనుపమ. ఈ విధంగా తెలుగు తమిళ ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోయింది.ఈ విధంగా అనుపమ పరమేశ్వరన్ నటనలో ఏ మాత్రం తీసిపోదు. కానీ ఆమె వరుసగా ఫ్యామిలీ ఓరియంటెడ్ రోల్స్ చేయడం, గ్లామర్ రోల్స్ చేయకపోవడం, గ్లామర్ పాత్రల్లో పూజా హెగ్డే, రకుల్ ప్రీత్ సింగ్, సమంత, కాజల్ లాంటి వాళ్ళు దూసుకుపోవడంతో వారిని తట్టుకొని నిలబడలేకపోయింది  ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో నిఖిల్ హీరోగా నటిస్తున్న టువంటి రెండు మూవీస్ ఉన్నాయి. అవి విజయవంతమైతే తప్ప మళ్లీ ఆమె ట్రాక్ లోకి రావడం కష్టం అంటున్నారు సినీ ప్రముఖులు.

Advertisement

ALSO READ;

Advertisement

ఆర్ఆర్ఆర్ లో లాజిక్ మిస్ అయ్యింద‌ని ట్రోల్ చేస్తున్నవారికి నెటిజ‌న్ దిమ్మ‌తిరిగిపోయే రిప్లై..!

“ఆచార్య” సినిమాలో న‌టించిన ఈ అమ్మాయిని గుర్తుప‌ట్టారా…..? ఆమె ఎవ‌రంటే..!

 

Visitors Are Also Reading