Home » ఈ ఫోటోలో ఉన్న టాలెంటేడ్ హీరో అండ్ దర్శకుడు ఎవరో గుర్తు పట్టారా ?

ఈ ఫోటోలో ఉన్న టాలెంటేడ్ హీరో అండ్ దర్శకుడు ఎవరో గుర్తు పట్టారా ?

by Anji
Ad

గతంలో మెగా ఫోన్ పట్టి దర్శకత్వం వహించిన చాలా మంది హీరోలుగా, విలన్లుగా, నటులుగా మారిపోతున్నారు. ముఖ్యంగా హీరోగా తమలోని కొత్త టాలెంట్ ని పరిచయం చేస్తున్నారు. ఫొటోలో ఉన్న ఆయన కూడా ఈ కోవకు చెందిన వాడే. గతంలో ఆయన స్టార్ హీరోలతో సినిమాలు చేశారు. తెలుగులో ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబులతో సినిమాలు  తీసి హిట్ కొట్టాడు. ఇక ఆ తరువాత హీరోగా అదురగొట్టాడు. విలన్ గా మెప్పించాడు. ఇలా మల్టీ టాలెంటేడ్ యాక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో మంచి జోరు మీద ఉన్నాడు. తాజాగా ఆయన కీలక పాత్ర పోషిస్తున్న ఓ సినిమా నుంచి ఆయన లుక్ ని రివీల్ చేశారు మేకర్స్. గుబురు గడ్డం, చేతిలో గన్ పట్టుకొని ఎంతో స్టైలీష్ గా కనిపించి అందరికీ షాక్ ఇచ్చాడు. ఇంతకు ఆయన ఎవ్వరో గుర్తు పట్టారా ? 

Also Read :   పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం సుజిత్ ఏం చేశాడో తెలుసా ? 

Advertisement

అతను మరెవ్వరో కాదండోయ్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఖుషి వంటి బ్లాక్ బస్టర్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు, నటుడు ఎస్.జే.సూర్య. కోలీవుడ్ స్టార్ విశాల్ హీరోగా తెరకెక్కుతున్న మార్క్ ఆంటోని మూవీలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా మార్క్ ఆంటోని మూవీ నుండి ఎస్.జే.సూర్య లుక్ ని రివీల్ చేశారు మేకర్స్. ఎంతో స్టైలిష్ గా కనిపించాడు సూర్య. ఈ ఫోటోను అకస్మాత్తుగా చూస్తే.. సూర్యనే అని త్వరగా గుర్తు పట్టలేరు. తీక్షణగా చూస్తే మాత్రం గుర్తుపట్టవచ్చు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ మారింది. 

Advertisement

Also Read :  “ద‌స‌రా” సినిమాలో ఈ లాజిక్ ను గ‌మ‌నించారా….? డైరెక్ట‌ర్ నిజంగా తోపు భ‌య్యా..!

దీనిని చూసిన వారందరూ ఎస్.జే.సూర్య గుర్తు పట్టలేకుండా ఉన్నాడంటూ.. కామెంట్స్ చేస్తున్నారు. మార్క్ ఆంటోనీ మూవీలో ఎస్.జే.సూర్యతో పాటు దర్శకుడు సెల్వ రాఘవన్, సునీల్ వర్మ, అభినయ పలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మినీ స్టూడియోస్ ఎల్ఎల్పీ బ్యానర్ పై ఎస్.వినోద్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. జీ.వీ. ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో తెరకెక్కుతోంది. 

Also Read :  స‌మంత నా క్ర‌ష్…ఓపెన్ గా చెప్పేసిన తేజ్ నెట్టింట వైర‌ల్..!

Visitors Are Also Reading