Home » స‌మంత నా క్ర‌ష్…ఓపెన్ గా చెప్పేసిన తేజ్ నెట్టింట వైర‌ల్..!

స‌మంత నా క్ర‌ష్…ఓపెన్ గా చెప్పేసిన తేజ్ నెట్టింట వైర‌ల్..!

by AJAY
Ad

టాలీవుడ్ హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ ఇటీవ‌ల విడుద‌లైన విరూపాక్ష సినిమాతో సూప‌ర్ హిట్ ను అందుకున్నాడు. యాక్సిడెంట్ త‌ర‌వాత సాయి ధ‌ర‌మ్ తేజ్ మొద‌టి సినిమానే హిట్ అవ్వ‌డంతో మెగా అభిమానులు కుషీ అవుతున్నారు. స‌స్సెన్స్ థ్రిల్ల‌ర్ గా తెరకెక్కిన ఈ సినిమాను ఇప్పుడు హిందీ మ‌ల‌యాళ క‌న్న‌డ మ‌రియు త‌మిళ భాష‌ల్లో డ‌బ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్దం అవుతోంది.

Advertisement

ఈ సినిమాలో సంయుక్త మీన‌న్ హీరోయిన్ గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇక తెలుగులో ఇది సంయుక్త‌కు మూడో హిట్. దాంతో సంయుక్త మీన‌న్ కూడా తెలుగులో ల‌క్కీ హీరోయిన్ గా మారిపోయింది. ఇప్ప‌టికే బ్యూటీకి డైరెక్ట‌ర్ లు మ‌రియు నిర్మాత‌ల నుండి ఫోన్ లు వస్తున్న‌ట్టు టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే విరూపాక్ష సినిమా హిట్ అవ్వ‌డంతో ఈ సినిమా చూడ్డానికి ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్ కు ర‌ప్పించేందుకు హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ సినిమా కోసం అన్ని విధాలా ప్ర‌మోష‌న్స్ చేస్తున్నాడు.

Advertisement

ఈ నేప‌థ్యంలోనే సాయిధ‌ర‌మ్ తేజ్ తాజాగా ట్విట్ట‌ర్ లో అభిమానుల‌తో ముచ్చ‌టించాడు. ప్ర‌శ్న‌లు వేయండి స‌మాధానాలు చెబుతాను అంటూ ఆఫ‌ర్ ఇచ్చాడు. దాంతో అభిమానులు త‌మ‌కు ఉన్న డౌట్స్ అన్నీ క్లియ‌ర్ చేసుకున్నారు. ఇక ఓ అభిమాని మీ క్ర‌ష్ ఎవ‌రు అంటూ ప్ర‌శ్నించాడు. కాగా సాయి ధ‌ర‌మ్ తేజ్ బాలీవుడ్ హీరోయిన్ ల పేరు చెప్పి త‌ప్పించుకోకుండా స‌మంత అంటూ ఓపెన్ అయ్యాడు. అంతేకాకుండా మ‌రో అభిమాని మెగా హీరోలు కాకుండా మీ అభిమాన హీరో ఎవ‌రు అంటూ ప్ర‌శ్నించాడు. దానికి తేజ్ ప్రభాస్ అన్న మ‌రియు ర‌వితేజ గారు అంటూ స‌మాధానం ఇచ్చాడు. ఇక తేజ్ చేసిన కామెంట్ లు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

ALSO READ :“ద‌స‌రా” సినిమాలో ఈ లాజిక్ ను గ‌మ‌నించారా….? డైరెక్ట‌ర్ నిజంగా తోపు భ‌య్యా..!

Visitors Are Also Reading