Home » పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం సుజిత్ ఏం చేశాడో తెలుసా ? 

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం సుజిత్ ఏం చేశాడో తెలుసా ? 

by Anji
Ad

తెలుగు చలనచిత్ర సినీ పరిశ్రమలో చాలా మంది దర్శకులు పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్స్. అందులో దర్శకుడు సుజిత్ కూడా ఉన్నాడు. ఈ విషయాన్ని గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ తెలిపారు. గబ్బర్ సింగ్ చిత్రం హిట్ అయిన సందర్భంలో ఫస్ట్ షో చూసి సుజిత్ థియేటర్ నుంచి బయటికి వస్తూ.. పవన్ కళ్యాణ్ అంటూ అరుస్తున్న వీడియోని సోషల్ మీడియాలో విడుదల చేయడం జరిగింది. OG మూవీ ప్రకటన సమయంలో హరీష్ ఈ రీతిగా సుజిత్ పవన్ వీరాభిమాని అని అభిమానులకు క్లారిటీ ఇచ్చాడు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం OG సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ముంబైలో మొదటి షెడ్యూల్ భారీగా జరుగుతుంది.  

Also Read :  Samyuktha : టాలీవుడ్ లక్కీ భామ.. ఈ హీరోయిన్ ఉంటే సినిమా పక్క హిట్?

Advertisement

డ్రగ్స్ మాఫియా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ గా పవన్ కనిపించనున్నట్టు సమాచారం. ఈ క్రమంలో సినిమాకి సంబంధించి వర్కింగ్ స్టిల్స్ పవన్ అభిమానులను ఆకట్టుకునేవిధంగా దర్శకుడు సుజిత్ అన్ని దగ్గరుండి విడుదల చేస్తూ ఉన్నారు. ‘OG’  సినిమాకి సంబంధించి ఇప్పటివలకు విడుదలైన స్టిల్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఈ చిత్రంలో ప్రత్యేకంగా పవన్ పక్కన ఎలాంటి హీరోయిన్ అయితే సూట్ అవుతుంది అనే కోణంలో కొంత మంది అభిమానులతో OG స్టార్ట్ చేయకముందు దర్శకుడు సుజిత్ డిస్కషన్ చేసి ప్రియాంక అరుల్ మోహన్ ని సెలెక్ట్ చేశారట. 

Advertisement

Also Read :  సమంత 16 ఏళ్ల వయసు ఫోటోలు మీరు చూసారా.. ఎంత అందమంటే..!!

Manam News

ఈ రీతిగా సినిమా స్టార్ట్ అయ్యాక స్టిల్స్ రిలీజ్ చేయడం అంతకు ముందు నటీనటులను ఎంచుకోవడంతో పాటు ఫైట్స్ విషయంలో కూడా చాలా శ్రద్ధ తీసుకోవడం జరిగిందట. ఓజీలో అన్ని అభిమానులు కోరుకునే విధంగా ఉండే రీతిలో పవన్ అభిమానిగా దర్శకుడు సుజిత్ చాలా జాగ్రత్తగా సినిమా తెరకెక్కిస్తున్నారట. ఇదే సమయంలో కొన్ని లొకేషన్స్ లో పవన్ కళ్యాణ్ ఫేస్ కట్ కి ఎలా ఉంటుందనేది సినిమా యూనిట్ వెళ్లకముందే స్పెషల్ ఫొటో షూట్స్ తనపై చేసుకుని హీరో ఎలా ఉంటాడో అనేది టెక్నికల్ గా చూసుకుంటూ చాలా ప్రత్యేకంగా ప్రాజెక్టులపై దర్శకుడు సుజిత్ శ్రద్ధ తీసుకుంటున్నట్టు పవన్ కళ్యాణ్ అభిమానులకు ఫుల్ మీల్స్ ఓజీ రూపంలో ఇవ్వడానికి రెడీ అవుతున్నట్టు సమాచారం. 

Also Read :   “ద‌స‌రా” సినిమాలో ఈ లాజిక్ ను గ‌మ‌నించారా….? డైరెక్ట‌ర్ నిజంగా తోపు భ‌య్యా..!

Visitors Are Also Reading