Home » పవన్ కళ్యాణ్ సుస్వాగతం హీరోయిన్ మీకు గుర్తుందా..? ఇప్పుడు ఏం చేస్తుందంటే..?

పవన్ కళ్యాణ్ సుస్వాగతం హీరోయిన్ మీకు గుర్తుందా..? ఇప్పుడు ఏం చేస్తుందంటే..?

by Anji
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ ప్రారంభంలో నటించిన సినిమాల్లో సుస్వాగతం చిత్రం ఒకటి. ఈ చిత్రం అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా ప్రేమకు సంబంధించి యువత ఆలోచనలను చాలా అద్భుతంగా చూపించారు దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు. ఈ యూత్ పుల్ లవ్ ఎంటర్ టైనర్ లో దేవయాని హీరోయిన్ గా నటించింది. 

Advertisement

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్, దేవయానిల మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు అప్పట్లో యూత్ ని బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో పవన్ నటన అందరినీ కంట తడి పెట్టిస్తుంది. పవన్ ప్రేమను తిరస్కరించే సంధ్య పాత్రలో దేవయాని నటన కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. ముంబైకి చెందిన దేవయాని తొలుత బాలీవుడ్ లో కోయల్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా విడుదల కాలేదు. ఇక ఆ తరువాత తమిలం, మలయాళంలో పలు సినిమాలలో నటించింది. పెద్దగా గుర్తింపు మాత్రం రాలేదు. తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన నటించిన సుస్వాగతం చిత్రం సూపర్ హిట్ అయింది. దీంతో పవన్ తో పాటు దేవయానికి కూడా అవకాశాలు పెరిగాయి. దీని తరువాత శ్రీకాంత్ తో మాణిక్యం, జగపతిబాబుతో శ్రీమతి వెళ్లొస్తా వంటి సినిమాలతో పాటు తదితర  చిత్రాల్లో నటించింది. ఈమె హీరోయిన్ గా ఎక్కువ రోజులు మాత్రం క్లిక్ కాలేకపోయింది. 

Advertisement

Also Read :   రామానాయుడు ఆ స్టార్ హీరోయిన్ ను ప్రేమించారా..?

ఈ నేపథ్యంలో తమిళ సినిమా పరిశ్రమకు చెందిన దర్శకుడు రాజకుమారన్ తో ప్రేమలో పడింది దేవయాని. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. 2001 ఏప్రిల్ 09న రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి ప్రేమకు గుర్తుగా ఇనియా, ప్రియాంక అనే ఇద్దరూ పిల్లలు ఉన్నారు. పెళ్లి తరువాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన దేవయాని చెన్నకేశవరెడ్డి సినిమాలో బాలయ్యకి చెల్లిగా నటించింది. అదేవిధంగా నాని సినిమాలో మహేష్ బాబుకి తల్లిగా నటించింది. అదేవిధంగా ఎన్టీఆర్ హీరోగా నటించిన జనతా గ్యారేజ్, అరవింద సమేత చిత్రాలతో పాటు బాలయ్య నటించిన ఎన్టీఆర్ కథానాయకుడు సినిమాలో కూడా నటించి మెప్పించింది దేవయాని. ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లో తల్లి, అక్క, చెల్లి వంటి పాత్రల్లో నటిస్తూనే.. మరోవైపు బుల్లితెరపై కూడా రాణిస్తోంది. ప్రస్తుతం ఆమె కోలీవుడ్ లో కూడా పలు టీవీ సీరియల్స్ లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.  

Also Read :  బాలకృష్ణ కారణంగానే స్టార్ హీరో అయిన ఎన్టీఆర్..అలా చేయడంతో..!

Visitors Are Also Reading