Home » రామానాయుడు ఆ స్టార్ హీరోయిన్ ను ప్రేమించారా..?

రామానాయుడు ఆ స్టార్ హీరోయిన్ ను ప్రేమించారా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మూవీ మొగల్ గా పేరుపొందిన ఏకైక నిర్మాత రామానాయుడు. ఆయన కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా అన్ని భాషల్లో సినిమాలకు నిర్మాతగా చేసి తెలుగోడి సత్తా ఏంటో చూపించారు. అలాంటి రామానాయుడు భారత సినీ చరిత్రలో వంద చిత్రాలు నిర్మించిన నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. అంతేకాకుండా గిన్నిస్ రికార్డు లోకి కూడా ఎక్కారు. కృష్ణంరాజు, శోభన్ బాబు,కృష్ణ,ఏఎన్నార్, ఎన్టీఆర్, వెంకటేష్, చిరంజీవి, బాలకృష్ణతో ఎన్నో హిట్ సినిమాలు తీసిన ఘనత సురేష్ ప్రొడక్షన్ సొంతం.

Advertisement

అయితే అప్పట్లో తన బ్యానర్లో చేసే నటీనటులకు చాలా కరెక్ట్ గా పారితోషికం ఇస్తారని రామానాయుడుకు మంచి పేరు ఉంది. ఆయన ఎంత అమౌంట్ ఇస్తారో అంత పని చేయించుకుంటారట. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో ఎంతోమంది స్టార్ హీరో, హీరోయిన్లకు సూపర్ డూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ఆయన బ్యానర్లో చేసిన జయప్రద, శ్రీదేవి, వాణిశ్రీ లాంటి స్టార్ హీరోయిన్లు సూపర్ హిట్లు అందుకున్నారు. ఇందులో ముగ్గురు హీరోయిన్స్ అంటే రామానాయుడుకి చాలా స్పెషల్. కానీ అప్పట్లో రామానాయుడు వాణిశ్రీపై మనసు పడ్డారని అనేక వార్తలు వచ్చాయి.

Advertisement

ఇందులో నిజం ఎంత ఉందో అబద్ధం ఎంత ఉందో తెలియదు కానీ. వాణి శ్రీని తన బ్యానర్ లో వచ్చే సినిమాలలో ఎక్కువగా ఆయన రిఫర్ చేసే వారట. ఒక్క వాణిశ్రీ శోభన్ బాబు కాంబినేషన్లో సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో 11 సినిమాలు వచ్చాయి అంటే ఆయన వాణిశ్రీ కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చేవారో అర్థం చేసుకోవచ్చు. రామానాయుడు బ్యానర్ లోనే వాణిశ్రీ చాలా పాపులర్ హీరోయిన్ గా మారింది.

also read:

Visitors Are Also Reading