Home » బాలకృష్ణ కారణంగానే స్టార్ హీరో అయిన ఎన్టీఆర్..అలా చేయడంతో..!

బాలకృష్ణ కారణంగానే స్టార్ హీరో అయిన ఎన్టీఆర్..అలా చేయడంతో..!

by Anji
Ad

నందమూరి ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా నందమూరి హీరోలు చాలా మంది వచ్చారు. కానీ అందులో సీనియర్ ఎన్టీఆర్ తరువాత ఆ స్థాయిలో క్రేజీ సంపాదించుకున్న హీరోలు ఎవరన్న ఉన్నారంటే.. ఒకరు బాలకృష్ణ కాగా.. మరొకరు జూనియర్ ఎన్టీఆర్. ఇక ఒక రకంగా చెప్పాలంటే బాలయ్య కంటే కూడా జూనియర్ ఎన్టీఆర్ కి ఫాలోయింగ్ ఎక్కువగానే ఉంది. ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయాడు ఎన్టీఆర్. అప్పట్లో బాలకృష్ణ చేసిన పని వల్లనే జూనియర్ ఎన్టీఆర్ ఓ స్టార్ హీరో అయ్యాడట. బాలయ్య ఏం చేశాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

నిన్ను చూడాలని సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు ఎన్టీఆర్. అయితే ఆ సినిమా ఆశించిన మేరకు ఆకట్టుకోలేదు. ఆ సినిమా తరువాత వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు రాజమౌళి. ఈ చిత్రం ఇటు ఎన్టీఆర్ కి, అటు రాజమౌళికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఆ తరువాత రాజమౌళి తెరకెక్కించిన సింహాద్రి చిత్రం మాత్రం జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ నే మార్చేసింది. ఈ సినిమా ఎన్ని రికార్డులను సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సి అవసరమే లేదు. కేవలం 20 ఏళ్ల వయస్సులోని ఎన్టీఆర్ కి మాస్ ఫాలోయింగ్ ని తెచ్చిపెట్టింది సింహాద్రి మూవీ.  

Advertisement

Also Read :  తారకరత్న తల్లిదండ్రులు ఇంటికి రాకుండా ఫిలిం ఛాంబర్ కి రావడానికి కారణమేంటి ?

ఈ సినిమా కథను తొలుత రచయిత విజయేంద్ర ప్రసాద్ బాలయ్యను దృష్టిలో పెట్టుకొని సిద్ధం చేశారట. అయితే ఈ కథలో బాలయ్యను హీరోగా పెట్టి విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం వహించాలనుకున్నారట. బాలయ్యకి కథ వినిపించగా.. ఆయన ఈ కథను రిజెక్ట్ చేశారట. దీంతో స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో హిట్ కొట్టి కథ కోసం ఎదురుచూస్తున్న రాజమౌళికి విజయేంద్ర ప్రసాద్ ఈ కథ చెప్పాడట. రాజమౌళికి ఈ కథ బాగా నచ్చడంతో కొన్ని మార్పులు చేయించి ప్రభాస్ తో చేయాలనుకున్నాడట. కానీ ప్రభాస్ కి అప్పటికే ఉన్న కమిట్ మెంట్ల వల్ల ఈ సినిమాని చేయలేకపోయాడు. దీంతో ఎన్టీఆర్ తో సింహాద్రి సినిమా చేశాడు రాజమౌళి. సింహాద్రి సినిమాతో  స్టార్ హీరోగా మారిపోయాడు జూనియర్ ఎన్టీఆర్.

Also Read :  రామానాయుడు ఆ స్టార్ హీరోయిన్ ను ప్రేమించారా..?

 

Visitors Are Also Reading