Home » నీట్‌లో స్టేట్‌ ర్యాంక్‌.. ఈమె సక్సెస్ చూస్తే చప్పట్లు కొడతారు..!

నీట్‌లో స్టేట్‌ ర్యాంక్‌.. ఈమె సక్సెస్ చూస్తే చప్పట్లు కొడతారు..!

by Sravya
Ad

చాలామంది మంచి మార్కులు తెచ్చుకోవాలని ఎంతో కష్టపడుతూ ఉంటారు కానీ అందరికీ అనుకున్నంత మార్కులు రావు. ఎంతో కష్టపడితే కానీ టాప్ మార్కులు రావు. దేశంలోనే అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షల్లో నీట్ పరీక్ష ఒకటి. ఈ పరీక్ష కోసం దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది విద్యార్థులు పోటీపడతారు. మెడిసిన్ చదవాలి అనుకునే వాళ్ళు ఈ నీట్ ఎంట్రెన్స్ టెస్ట్ ని రాస్తారు. ఈ ఎంట్రన్స్ టెస్ట్ అనేది క్లియర్ చేయడం అంత ఈజీ కాదు. దీని కోసం ప్రతి ఒక్కరు ఎంతో దృఢ సంకల్పంతో కృషి చేసి చదవాలి. పట్టుదలతో దేనిని సాధిస్తే శ్రమిస్తే సాధించలేనిది అంటూ ఏమీ ఉండదు.

neet

Advertisement

 

తాజాగా రాజస్థాన్లో నీట్ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. పేద కుటుంబానికి చెందిన ఒక యువతి తన లక్ష్యాన్ని సాధించడం కోసం అహర్నిశలు శ్రమించి సక్సెస్ ని అందుకుంది. 686 మార్కులు సాధించింది ప్రేరణ. ఈమె తండ్రి ఒక ఆటో డ్రైవర్. అయితే అతనే ఏకైక జీవనాధారం. ఈమె టెన్త్ చదువుతున్నప్పుడు ఆయన క్యాన్సర్ తో చనిపోయారు దీంతో ప్రేరణకు తన చదువును కొనసాగించడం చాలా కష్టంగా మారింది.

Advertisement

Also read:

Also read:

కుటుంబ బాధ్యత మొత్తం ఆమె భుజాల మీద పడింది తల్లికి కూడా ఎలాంటి జీవనాధాయం లేదు సరి కదా తిరిగి వాళ్లకు 27 లక్షల అప్పు ఉంది. అప్పు చెల్లించే అంత డబ్బు ప్రేరణ కుటుంబం దగ్గర లేదు కనీసం తినడానికి సరైన తిండి కూడా ఉండేది కాదు ప్రతిరోజు 12 గంటల పాటు చదువుకునేది పట్టుదలతో పరీక్షను రాసి స్టేట్ ఫస్ట్ గా నిలిచింది. ఆమెకు ప్రభుత్వ వైద్య కళాశాలలో సీటు వచ్చింది దీంతో ప్రేరణ దృఢ సంకల్పం చూసి ఆమె తల్లి బంధువులు ఆమె పట్ల ప్రశంసలు కురిపించారు. పేదరికం చదువుకి ఏ మాత్రం అడ్డం కాదని ఈమె ప్రూవ్ చేసింది ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading