Home » పవన్ కళ్యాణ్ – దాసరి నారాయణరావుతో సినిమా ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

పవన్ కళ్యాణ్ – దాసరి నారాయణరావుతో సినిమా ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

by Bunty
Ad

పవన్ కళ్యాణ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ఉన్నా పవన్ కళ్యాణ్ చాలా డిఫరెంట్. ఆయన సినిమాల నుంచి మొదలు అభిమానుల వరకు అన్ని ప్రత్యేకంగానే ఉంటాయి. ఇప్పటికే ఆయన ఎన్నో సినిమాల్లో నటించి బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్నాడు. ప్రస్తుతం క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టి ముందుకు సాగుతున్నాడు. ఓవైపు సినిమాలు చేస్తూ, మరోవైపు రాజకీయాలు చేస్తూ తనదైన స్టైల్ లో గుర్తింపు సాధించుకుంటున్నాడు.

Advertisement

అలాంటి పవన్ కళ్యాణ్ కు యూత్ లో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాగా, తెలుగు సినిమా ఇండస్ట్రీలో దిగ్గజ దర్శకులలో ఒకరు దర్శకరత్న దాసరి నారాయణరావు. ఆయన దర్శకుడు, నిర్మాతగా పనిచేశారు. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం ఆయన చనిపోయే ఏడాదికి ముందు ఒక సినిమా చేద్దామని అనుకున్నారు. స్వయంగా ఆయనే దాసరి వద్దకు వెళ్లి మీలాంటి లెజెండ్ ఇలా ఖాళీగా ఉండకూడదు అండి. మనం ఇద్దరం కలిసి సినిమా చేద్దామని పవన్ చెప్పాడట.

Advertisement

అయితే దాసరి నారాయణరావు దర్శకత్వం వహించకుండా నిర్మాతగా వ్యవహరించాలి అనుకున్నారు. ఆ సినిమాకు దర్శకుడిగా దర్శకధీరుడు రాజమౌళిని దించాలని దాసరి భావించారట. తనకి పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేసి పెట్టాల్సిందిగా కొరాడట. రాజమౌళి కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్. కానీ ఇంతలోపే దాసరి తిరిగిరాని లోకాలకు వెళ్లారు. ఒకవేళ ఈ ప్రాజెక్టు పూర్తి అయి ఉంటే నిర్మాతగా దాసరి రేంజ్ ఏ స్థాయికి వెళ్లేదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఏం చేద్దాం చాలా బ్యాడ్ లక్ అని చెప్పుకోవాలి.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు: 

 ఏపీ ప్రభుత్వ ఆసుపత్రిలో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు… లక్ష జీతం

Suryakumar Yadav : సూర్య బ్యాటింగ్ చూసి సచిన్ షాక్… వీడియో వైరల్

జగన్‌ ప్రభుత్వం సంచలనం – చంద్రబాబు గెస్ట్ హౌస్ అటాచ్ ..!

 

Visitors Are Also Reading