Home » ‘కస్టడీ’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్… స్ట్రీమింగ్ అప్పటి నుంచే!

‘కస్టడీ’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్… స్ట్రీమింగ్ అప్పటి నుంచే!

by Bunty
Ad

టాలీవుడ్ లో వేగంగా సినిమాలు చేస్తూ కనీసం ఏడాదికి రెండు చిత్రాలతోనైనా ప్రేక్షకులను అలరిస్తూ ముందుకు సాగిపోతున్నాడు యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య. ఆ మధ్య హ్యాట్రిక్ విజయాలను అందుకున్న అతడు గత ఏడాది వరుస దెబ్బలను తిన్నాడు. దీంతో ఈసారి ఎలాగైనా సక్సెస్ ను సాధించాలన్న పట్టుదలతో తాజాగా కస్టడీ అనే ద్విభాషా చిత్రంతో వచ్చాడు.

Advertisement

దీనికి ఆరంభంలోనే మిక్స్డ్ టాక్ రావడంతో ఓపెనింగ్స్ పై ప్రభావం పడింది. రెండో రోజు కూడా నిరాశపరిచింది. మొదటి రోజు ఈ సినిమా 7.4 కోట్ల గ్రాస్, 3.9 కోట్ల షేర్ దక్కించుకున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. శుక్రవారం నాడు నైజాంలో అత్యధికంగా కోటి వరకు ఈ సినిమాకు కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. సీడెడ్ లో 50 లక్షల వరకు వసూళ్లు రాబట్టినట్లు చెబుతున్నారు.

Advertisement

ఇలాంటి తరుణంలో ఈ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ పై కీలక అప్డేట్ వచ్చేసింది. ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ ‘కస్టడీ’ స్ట్రీమింగ్ రైట్స్ ను భారీ ధరకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. జూన్ తొలివారం లేదా రెండోవారంలో కస్టడీ ఓటీటీలోకి వస్తుందని టాక్. యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ రీసెంట్ మూవీస్ అయిన దసరా, శాకుంతలం, రావణాసుర, ఏజెంట్ మాదిరిగా నెల కంటే ముందే ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందట.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

నాగ చైతన్యకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన నాగార్జున ?

Sunisith : ఉపాసన తో గోవాకు సునిశిత్…చితక్కొట్టిన మెగా ఫ్యాన్స్‌!

చిరంజీవికే కండిషన్లు పెట్టిన శ్రీదేవి…ఆ తర్వాత దూలతీరింది…?

 

Visitors Are Also Reading