Home » తరుణ్ ప్రియమణి పెళ్లి ఎందుకు ఆగిందో తెలుసా..?

తరుణ్ ప్రియమణి పెళ్లి ఎందుకు ఆగిందో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో తరుణ్ మానియా నడిచింది. వరుస సినిమా హిట్లతో లవర్ బాయి గా మంచి పేరు తెచ్చుకున్నారు. అలాంటి తరుణ్ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన ఎంత స్పీడ్ గా స్టార్ హీరోగా ఎదిగారో అంతే స్పీడ్ గా ఇండస్ట్రీ నుంచి బయటకు వెళ్లిపోయారు. అయితే తరుణ్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడు ఆయన చాలా ప్రేమయానాలను నడిపించారు. అయితే తరుణ్ గురించి చెప్పగానే చాలామందికి గుర్తుకు వచ్చేది ఆర్తి అగర్వాల్. వీరిద్దరి మధ్య లవ్ బాండింగ్ చాలా నడిచిందని చెబుతారు. కానీ కొన్ని కారణాల వల్ల పెళ్లి చేసుకోలేకపోయారని అంటుంటారు. కానీ తరుణ్ మరో స్టార్ హీరోయిన్ కూడా ప్రేమించారట. ఆవిడే ప్రియమణి. ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ గా ఎదిగిన ప్రస్తుతం సినిమాల్లో తక్కువగా నటిస్తోంది.

Advertisement

రియాల్టీ షో లలో జడ్జిగా పని చేస్తోంది. అలాంటి ప్రియమణి మరియు తరుణ్ మధ్య ప్రేమ బాగానే నడిచిందట. ఒకానొక సమయంలో వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు కూడా వచ్చాయి. కానీ వీరి పెళ్లి కాలేదు.. కారణాలు ఏంటో చూద్దామా.. నవవసంతం సినిమాతో ఇద్దరు కలిసి నటించిన సమయంలో ప్రేమలో పడ్డారని వార్తలు వచ్చాయి. కలిసి పార్టీలకు పబ్బులకు కూడా వెళ్లారట. అయితే అది చూసి తరుణ్ తల్లి రోజారమణి ఒకరోజు సెట్స్ కు వచ్చి మీరు ఇద్దరు ప్రేమించుకుంటున్నారని తెలుసు. పెళ్లి చేస్తానంటూ ఆఫర్ చేసిందట.

Advertisement

కానీ ఆ సమయంలో ప్రియమణి మా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ మాత్రమే ఉందని మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు ఆంటీ సమాధానం ఇచ్చిందట. ఈ విషయాన్ని ఇక్కడితోనే మర్చిపోవాలని చెప్పిందట ప్రియమణి. అయితే ఈ విషయం మొత్తం ఒకరోజు ప్రియమణి ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది. ఆరోజు నేను ఒప్పుకొని ఉంటే ఇప్పుడు తరుణ్ భార్య అయి ఉండేదాన్ని అంటే చెప్పుకొచ్చింది.
మరి కొన్ని ముఖ్య వార్తలు:

Visitors Are Also Reading