Home » నెగిటివ్ ఆలోచనలు వస్తే ఏం చేయాలో తెలుసా…?

నెగిటివ్ ఆలోచనలు వస్తే ఏం చేయాలో తెలుసా…?

by Bunty
Ad

 

జీవితంలో అన్నీ అందరికీ దక్కవు. వాటికోసం కృషి చేయాలి. ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలి. అలసిపోకూడదు. నిరాశ చెందకూడదు. ఒకసారి విజయం దక్కకపోతే మరోసారి ప్రయత్నించాలి. మరోసారి ప్రయత్నించినా సక్సెస్ కాకపోతే మళ్లీ ప్రయత్నించాలి. ఇలా సక్సెస్ వచ్చేంతవరకు మనం ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. నిరాశకు లోను కాకూడదు. మనసులో నెగిటివ్ ఆలోచనలకు చెక్ పెట్టేయాలి.

Advertisement

ప్రతి విషయాన్ని కూడా పాజిటివ్ గా ఆలోచించాలి. నెగటివ్ విషయాలను అస్సలు మనసులోకి రానివ్వకూడదు. పాజిటివ్ గా ఉండాలి. మనసుని ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోవాలి. లేనిపోని నెగిటివ్ ఆలోచనలను మైండ్ లో నుంచి తొలగించాలి. నవ్వుతూ, నవ్విస్తూ ఉండడం అలవాటు చేసుకోవాలి. ఆధ్యాత్మిక ఫిలాసఫీలకి కేంద్రం అని చెప్పుకునే మన దేశంలో ఆనందస్థాయి తక్కువ ఉంది. బిలీనీయర్లు, బిలినియర్లు ప్రతి ఏటా అధికమవుతున్నారు. కానీ ఇక్కడ సంతోషంగా జీవించే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది.

Advertisement

ప్రపంచంలోని హ్యాపీయస్ట్ దేశాల వరుసలో ఎక్కడో అట్టడుగును 136వ స్థానంలో ఉన్నాం. ఫీల్ గుడ్ హార్మోన్ విడుదల అయ్యేది నవ్వినప్పుడే అని తెలుసుకోవాలి. నవ్వినప్పుడు ఊపిరితిత్తులు శుభ్రపడతాయి. శ్వాస మెరుగుపడుతుంది. నొప్పులు కనిపించవు. వ్యాధి నిరోధక శక్తి బలపడుతుంది. మెదడు చురుకు అవుతుంది. రోజు వారి కష్టాలు, జీవిత కష్టాలు ఉన్న నెగిటివ్ ఆలోచనలు రాకుండా ఉండాలంటే నవ్వుతూ ఉండాలి. దీనివల్ల కూల్ అవుతారు. బాగా నవ్వితే అన్ని మర్చిపోయి శూన్య స్థితికి వస్తాము. నవ్వడం వల్ల శరీరం తేలిక అవుతుంది. ఒత్తిడి తగ్గిపోతుంది. అందుకే కామెడీ షో లను, సినిమాలను చూడాలి. నవ్వడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పాజిటివ్ గా ఆలోచిస్తాం. అందుకే ఎంత నవ్వితే అంత ఆరోగ్యంగా ఉంటాము.

Visitors Are Also Reading