Home » Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశి వారికి వారం మధ్యలో ఓ సమస్క పరిష్కారం అవుతుంది

Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశి వారికి వారం మధ్యలో ఓ సమస్క పరిష్కారం అవుతుంది

by Anji
Ad

Weekly Rasi Phalau in Telugu 2023 :  రాశిఫలాలు  చ‌ద‌వ‌డం వ‌ల్ల ఏయే రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో వెంటనే తెలిసిపోతుంది.  ఈ వారం యొక్క రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Weekly Horoscope in Telugu

Advertisement

Weekly Horoscope in Telugu 23.04.2023 నుంచి 29.04.2023 వరకు మేషం :

Mesha

Mesha

కాలం కలిసొస్తుంది. వచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సాహోసోపేత కార్యాలు లాభాన్ని ఇస్తాయి. ఉద్యోగంలో కాస్త ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలుంటాయి. సకాలంలో నిర్ణయాలు తీసుకోవడం చాలా ఉత్తమం. ఆపద నుంచి బయటపడుతారు.

Weekly Horoscope in Telugu 2023: వృషభం 

Weekly Rasi Phalau in Telugu

Weekly Rasi Phalau in Telugu

మనోబలంతో మీ పనిని ప్రారంభించండి. ముఖ్యమైన కార్యక్రమాల్లో అప్రమత్తంగా ఉండాలి. మిత్రుల అండ మీకు చాలా అవసరం. సొంత నిర్ణయాలు కలిసి రావు. కుటుంబ సభ్యులను సంప్రదించాలి. వారం మధ్యలో ఓ సమస్య పరిష్కారమవుతుంది. మీ యొక్క మంచి తనమే మిమ్మల్ని కాపాడుతుంది.

Weekly Horoscope in Telugu : మిథునం

Mithuna

Mithuna

అనేక విధాలుగా కలిసి వస్తుంది. చేపట్టే పనుల్లో అధిక లాభాలు ఉన్నాయి. ఉద్యోగంలో అంచెలంచెలుగా పైకి వస్తారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. గతంలో ఆగిన పనులు తిరిగి ప్రారంభమవుతాయి.

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

సకాలంలో పనులు ప్రారంభించి పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఆలోచించి కీలకనిర్ణయం తీసుకోండి. వ్యాాపారంలో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. మిత్రులతో కలిసి ఆనందించే అవకాశముంది. వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం.

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

ఉత్సాహంగా నిర్ణయాలు తీసుకొని ప్రశాంతంగా పని చేయాలి. ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉంటాయి. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఆపదల నుంచి బయటపడతారు. వ్యాపారంలో ఇబ్బందులు తలెత్తుతాయి. కొందరూ మీ సహనాన్ని పరీక్షిస్తారు.

Weekly Horoscope in Telugu కన్య

Kanya

Kanya

మీ యొక్క ఆశయం నెరవేరుతుంది. ఎన్ని విఘ్నాలు ఉన్న బుద్ధిబలంతో విజయం సాధిస్తారు. ఇంట్లో వారి సూచనలు పని చేస్తాయి. దగ్గరి వారితో విభేదాలు రాకుండా చూసుకోవాలి. వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి.

Advertisement

Weekly Horoscope in Teluguతుల

Thula

Thula

సకాలంలో పని ప్రారంభిస్తే ఒత్తిడి తగ్గుతుంది. ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం. ధైర్యంగా ముందుకు వెళ్లాలి. అవసరానికి సహాయం అందుతుంది. ముఖ్యమైన కార్యక్రమాల్లో అప్రమత్తంగా ఉండాలి.

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉంటాయి. బంగారు భవిష్యత్ ఏర్పడుతుంది. పలు విధాలుగా అభివృద్ధి సాధిస్తారు. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. కాలం వృధా చేయకుండా కార్యసిద్ధిని సాధించాలి. 

Weekly Horoscope in Telugu ధనుస్సు

Dhanassu

Dhanassu

సంకల్పబలంతో పనులను ప్రారంభించి సకాలంలో పూర్తి చేయండి. దైవబలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. వ్యాపారంలో జాగ్రత్తలు చాలా అవసరం. కొన్ని నిర్ణయాల వల్ల ఖర్చులు పెరిగే అవకాశముంది. అపార్థాలకు తావు లేకుండా స్పష్టంగా మాట్లాడాలి.

Weekly Horoscope in Teluguమకరం

Makara

Makara

మీరు ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు మీకు విజయాన్ని అందిస్తాయి. ఒత్తిడిని జయించండి. ప్రతిభతో ఆశించిన ఫలితాలు సాధిస్తారు. ప్రతి పని కుటుంబ సభ్యులకు చెప్పి చేయడం ఉత్తమం. ఓ సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.  ఆవేశం అస్సలు పనికిరాదు.

Weekly Horoscope in Teluguకుంభం

Kumbham

Kumbham

ఉద్యోగంలో స్థిరమైన ఫలితాలుంటాయి. ధర్మబద్ధంగా నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. మీ యొక్క నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. ఓ ఆపద నుంచి నుంచి మీరు బయటపడుతారు. అపార్థాలకు అస్సలు తావివ్వకూడదు. వ్యాపారంలో రుణసమస్యలు పెరగకుండా జాగ్రత్త పడాలి.

Weekly Rasi Phalau in Telugu : మీనం

Meena

Meena

పలు మార్గాల్లో ఆదాయం లభిస్తుంది. ఖర్చులను అదుపులో ఉంచుకోవడం చాలా ఉత్తమం. బంధు, మిత్రులతో కలిసి సంతోసంగా గడుపుతారు. ప్రతిభతో అధికారులను మెప్పిస్తారు. ఓ ఆపద నుంచి మీరు బయటపడుతారు. మనోబలంతో త్వరగా లక్ష్యాన్ని చేరుకుంటారు.

Also Read :

Visitors Are Also Reading