Home » బాలి వెకేషన్ లో సమంతతో పాటు ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా ?

బాలి వెకేషన్ లో సమంతతో పాటు ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా ?

by Anji

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతానికి సినిమాల నుంచి విరామం తీసుకున్నది. తన శారీరక, మానసిక  ఆరోగ్యంపై మరింత దృష్టి సారించేందుకు సుమారు ఏడాదికి పైగా సమంత సినీ పరిశ్రమకు దూరంగా ఉండనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే అగ్రిమెంట్లు కుదుర్చుకున్న సినిమాలలో తన షూటింగ్ పార్ట్ ని కూడా పూర్తి చేసింది. కొందరికీ అడ్వాన్స్ లు కూడా తిరిగిచ్చేసింది.

మానసిక ప్రశాంతత కోసం ఇటీవల కోయంబత్తూరులోని ఇషా సెంటర్ ను సందర్శించింది. ఆ తరువాత వెంటనే బాలి వెకేషన్ కి వెళ్లిపోయింది. ప్రకృతి అందాల మధ్య హాయిగా గడుపుతోంది. సమంత ఒంటరిగా బాలి వెళ్లలేదు. తన స్నేహితురాలు అని వెంట తీసుకెళ్లింది. బాలివెకేషన్ కి సంబంధించి సమంత సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోల్లో ఆమె ఉండటం విశేషం. ఆమె ఎవరు..? సమంతకి ఎలా పరిచయం అయింది ? అని అభిమానులు, నెటిజన్లు అయోమయంలో పడ్డారు. గతంలో చెప్పినట్టు సినీ పరిశ్రమలో సమంతకు చాలా మంది స్నేహితులు సన్నిహితులున్నారు.

 

అత్యంత సన్నిహితులు మాత్రం సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నారని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింది. సమంతతో కలిసి బాలి ట్రిప్ కి వెళ్లిన అమ్మాయి పేరు అనుష స్వామి. తాను సమంతకు అత్యంత సన్నిహితురాలు.. సినీ రంగానికి కాసత్ దూరమైనా ఆమెకు కూడా కళల పట్ల ఆసక్తి, ప్రావీణ్యముంది. అనూష స్వామి బహుముఖ ప్రజ్ఞావంతురాలు. భరత నాట్యంలో ఆమెకు మంచి ప్రావీణ్యముంది. అనుష స్వామికి సొంతంగా డ్యాన్స్ స్టూడియో ఉంది. పోల్ డ్యాన్స్ తో సహా రకరకాల నృత్యాలను నేర్పిస్తుంది. 

Visitors Are Also Reading