Home » స్టూడెంట్ నం.1 చిత్రాన్ని మిస్‌ చేసుకున్న స్టార్‌ హీరో..అతని ఫోన్‌ కాల్‌తో హీరో మారిపోయాడట!

స్టూడెంట్ నం.1 చిత్రాన్ని మిస్‌ చేసుకున్న స్టార్‌ హీరో..అతని ఫోన్‌ కాల్‌తో హీరో మారిపోయాడట!

by Bunty
Ad

‘స్టూడెంట్ నెం.1’ సినిమా పేరు చెప్పగానే వెంటనే మన కళ్ళ ముందు ఎన్టీఆర్ డ్యాన్స్, తారక్ డైలాగ్స్, జూనియర్ ఎన్టీఆర్ నటన కదలాడుతాయి. అంతలా సినిమాలో నట విశ్వరూపం చూపించాడు. ఇప్పటికీ ఆ సినిమా వస్తే టీవీ స్క్రీన్ ల ముందు నిలిచిపోయే ప్రేక్షకులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. రాజమౌళి తెరకెక్కించిన స్టూడెంట్ నెం.1 చిత్రం అప్పట్లో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిన విషయమే.

READ ALSO : Google Top Search Heroines :ఇప్పటికీ ఆమెదే పై చేయి.. టాప్ సెర్చ్ హీరోయిన్ ఎవరంటే ?

Advertisement

అటు దర్శకుడిగా జక్కన్నకు, ఇటు హీరోగా ఎన్టీఆర్ కు ఫస్ట్ మూవీ కావడం మరో విశేషం. వీరిద్దరి కాంబోలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ చిత్రానికి తెలుగు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన లభించింది. అయితే ఈ సూపర్ హిట్ చిత్రానికి ముందుగా అనుకున్న హీరో ఎన్టీఆర్ కాదట. మరో హీరోను అనుకున్నారట. ఈ విషయాన్ని ఇటీవల నిర్మాత చలసాని అశ్విని దత్ ప్రముఖ షో ఆలీతో సరదాగాలో పాల్గొని పేర్కొన్నారు.

Advertisement

స్టూడెంట్ నెం.1 సినిమాను 2001లో నిర్మాత అశ్విని దత్ అనుకున్నప్పుడు తోలుత ప్రభాస్ తో చేయాలని అనుకున్నారట. అంటే ఆ సినిమాతో ప్రభాస్ టాలీవుడ్ కు పరిచయం చేద్దామని, ఆ దిశగా చర్చలు సాగుతున్న సమయంలో అశ్విని దత్ కి హరికృష్ణ నుండి ఫోన్ వచ్చిందట. దీంతో అశ్విని దత్ ఆలోచన మారిందని, ఇక ఆ సినిమా అటు తిరిగి, ఇటు తిరిగి ఎన్టీఆర్ దగ్గరకు వచ్చిందట. అలా ఆ సినిమాలో ప్రభాస్ ను కాదని ఎన్టీఆర్ ను తీసుకున్నామని అశ్విని దత్ చెప్పారు. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ నిర్మించగా, 2001లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రం తమిళంలో అదే టైటిల్ తో 2003లో రీమేక్ అయింది.

READ ALSO : చావు అంచుల దాకా వెళ్లిన నా భర్త ఎలా బ్రతికాడంటే… జబర్దస్త్ క్వీన్ వినోదిని భార్య ఎమోషనల్…!

Visitors Are Also Reading