Home » అతనొక్కడే సినిమాని మిస్ చేసుకున్న ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా ?

అతనొక్కడే సినిమాని మిస్ చేసుకున్న ఆ స్టార్ హీరో ఎవరో తెలుసా ?

by Anji
Ad

టాలీవుడ్ అగ్ర దర్శకులలో ఒకరైన సురేందర్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. కళ్యాణ్ రామ్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన చిత్రం అతనొక్కడే. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సూపర్ హిట్ సాధించింది. ఈ చిత్రం విజయంతోనే కళ్యాణ్ రామ్ మాస్ హీరోగా మంచి పేరు సంపాదించుకున్నారు. దీంతో వరుసగా మాస్ సినిమాలు చేస్తూ.. హీరోగా నిలదొక్కుకున్నాడు కళ్యాణ్ రామ్. ఇదిలా ఉంటే.. అతనొక్కడే సినిమా స్టోరీని తొలుత దర్శకుడు సురేందర్ రెడ్డి జూనియర్ ఎన్టీఆర్ కి చెప్పాడట. అయితే అప్పటికే సురేందర్ రెడ్డి కి దర్శకత్వంలో ఎక్స్ పీరియన్స్ లేకపోవడంతో.. మళ్లీ అది ఆయనకు ఫస్ట్ సినిమా కావడం వల్ల ఎన్టీఆర్ ఆ సినిమా చేయలేదని సమాచారం. 

Advertisement

ఇక ఆ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఎన్టీఆర్ ‘అశోక్’ అనే సినిమాలో నటించాడు. కానీ ఆ సినిమా  అట్టర్ ఫ్లాప్ అయింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అతనొక్కడే చిత్రం ఎన్టీఆర్ కి పడితే అసలు ఇండస్ట్రీ హిట్ కొట్టేదని అనుకుంటుంటారు. అదేవిధంగా సురేందర్ రెడ్డి ఎన్టీఆర్ తో తీద్దామనుకున్న కిక్ చిత్రం  విషయంలో కూడా ఎన్టీఆర్ ఇలానే చేశాడట. ఆ తర్వాత మళ్లీ ఊసరవెల్లి తీసి మరో ఫ్లాప్ అందుకున్నాడు. అలా వీరిద్దరి కాంబోలో వచ్చిన రెండు సినిమాలు ఫ్లాప్ అయ్యాయనే చెప్పాలి. వాస్తవానికి వీరి కాంబినేషన్లో ఒక హిట్ సినిమా పడితే మాత్రం అది ఇండస్ట్రీ లోనే రికార్డు సృష్టిస్తుందనే చెప్పవచ్చు. 

Advertisement

Also Read :  ఒకే కథతో వచ్చిన ముగ్గురు స్టార్ హీరోల సినిమాలు..ఏది హిట్ అంటే..?

ప్రస్తుతం సురేందర్ రెడ్డి అక్కినేని అఖిల్ హీరోగా ‘ఏజెంట్’ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంతో సురేందర్ రెడ్డి హిట్ కొట్టి మళ్ళీ తన ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు. ఎందుకంటే అఖిల్ తన కెరీర్ ని ప్రారంభించి ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా.. కానీ ఒక్క మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా తప్ప ఇప్పటివరకు తీసిన సినిమాలు ఏవీ కూడా అంతగా హిట్ కాలేదు. ఏ ఒక్క సినిమా కూడా హిట్ కాకపోవడంతో ఏజెంట్ సినిమా తోనైనా సరైన హిట్ అందుకోవాలని ఇటు అఖిల్, అటు సురేందర్ రెడ్డి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఏజెంట్ చిత్రం ఎలాంటి ఫలితాన్నిస్తుందో తెలియాలంటే మాత్రం ఏప్రిల్ 28 వరకు ఎదురుచూడాల్సిందే. 

Also Read :  Happy Ugadi 2023 Wishes, Greetings, Messages Quotes, Subhakankshalu in Telugu తెలుగు ఉగాది శుభాకాంక్షలు

Visitors Are Also Reading