Home » సిల్క్ స్మితను చివరి చూపు చూసేందుకు వచ్చిన ఏకైక హీరో ఎవరో తెలుసా ?

సిల్క్ స్మితను చివరి చూపు చూసేందుకు వచ్చిన ఏకైక హీరో ఎవరో తెలుసా ?

by Anji

ఒకప్పుడు దక్షిణాది చిత్ర పరిశ్రమను ఏలిన నటులలో  సిల్క్ స్మిత ఒకరు. స్టార్ హీరోలు సైతం ఆమె డేట్స్ కోసం చాలా మంది ఎదురుచూసేవారు. మూవీ మేకర్స్ మా సినిమాలో ఒక్క సాంగ్ చేయరా.. అంటూ సిల్క్ స్మిత వెంట పడుతూ ఉండేవారు. కళ్ళతో ఆమె ఒక్క ఎక్స్ప్రెషన్ ఇస్తే చాలు.. కుర్రాళ్ళు బౌల్డ్ అవ్వాల్సిందే. 36 ఏళ్లకే ఆమె అకస్మాత్తుగా మరణించడం పట్ల అప్పట్లో పెద్ద సంచలనమే చోటుచసుకుంది. ఆమె చనిపోవడానికి అసలు కారణాలేంటో ఇప్పటికీ తెలియడం లేదు. ఆమె మరణం పట్ల ఒక్కొక్కరూ ఒక్కో విధంగా చెబుతుంటారు. ముఖ్యంగా ఆమె ప్రేమ విఫలం చెందిందని కొందరు అంటుంటే.. మరికొందరు సినిమా నిర్మాణ రంగంలోకి దిగి పెద్ద ఎత్తున అప్పుల పాలైనట్లు కూడా వార్తలు వినిపించాయి. కొందరు మద్య పానం వ్యసనం ఆమెను బలి తీసుకున్నది అనే వారు కూడా ఉన్నారు. 

చనిపోవడానికి ముందు రోజు సాయంత్రం రాత్రి సిల్క్ స్మిత చాలామందికి ఫోన్ చేసినట్టు.. ఆ తర్వాత చాలామంది పలు ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు. సిల్క్ స్మిత చనిపోయాక ఆమెతో అవసరం తీరిపోయింది అనుకున్నా చిత్రపరిశ్రమ కనీసం ఒక్క సంస్మరణ సభ కూడా ఏర్పాటు చేయలేదు. కానీ మళ్లీ ఆమె కథనే సినిమాకు ముడి సరుకుగా వాడుకోవడానికి కూడా వెనకాడడం లేదు. సిల్క్ స్మిత మరణించడం పట్ల సినీ పరిశ్రమంతా దిగ్భ్రాంతికి గురైంది. అయితే ఆమె చివరి చూపు చూసేందుకు మాత్రం చాలా మంది రాకపోవడంతో అప్పటి జర్నలిస్టులు ఆశ్చర్యపోయారు.  

Also Read :  ట్రోలర్స్ కు అనసూయ దిమ్మ తిరిగిపోయే కౌంటర్… అలాంటి దాన్ని కాదు అంటూ….!

Manam News

ముఖ్యంగా సిల్క్ స్మితను  చివరిసారిగా చూసేందుకు వచ్చిన అప్పటి టాప్ హీరో కేవలం యాక్షన్ కింగ్ అర్జున్ మాత్రమే. ఎవ్వరు కూడా పట్టించుకోకపోయినా అర్జున్  మాత్రం రావడం చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ విషయాన్ని డైరెక్ట్ గా కొంత మంది  జర్నలిస్టులు అర్జున్ ని అడిగారట. అంతకు కొద్ది రోజుల ముందే ఓ సినిమా షూటింగ్ చివరి రోజు అర్జున్ తో  “నేను చనిపోతే నన్ను చూడడానికి వస్తావా” అని సిల్క్ స్మిత అడిగిందంట.  ఛీ ఛీ అదేం మాట అని.. తేలికగా అర్జున్ కొట్టి పారేశాడట.  ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకోలేదు. ఎవ్వరు రాకపోయినా మీరు రావడం ఆశ్చర్యంగా ఉందని జర్నలిస్టులు ప్రశ్నించినప్పుడు ఆ విషయాన్ని గుర్తు చేసుకొని.. అర్జున్ ఏడుస్తూ బాధ పడ్డాడు.  

Also Read :  నేనేమీ ఒకేసారి మూడు పెళ్ళిళ్ళు చేసుకోలేదు….బాలయ్య షో లో పవన్ సెన్సేషనల్ కామెంట్స్..!

Visitors Are Also Reading