Telugu News » Blog » ట్రోలర్స్ కు అనసూయ దిమ్మ తిరిగిపోయే కౌంటర్… అలాంటి దాన్ని కాదు అంటూ….!

ట్రోలర్స్ కు అనసూయ దిమ్మ తిరిగిపోయే కౌంటర్… అలాంటి దాన్ని కాదు అంటూ….!

by AJAY
Ads

యాంకర్ అనసూయ అంటే తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. అయితే అనసూయ ఒకప్పుడు కేవలం యాంకర్…కానీ ఇప్పుడు యాక్టర్ కూడా. జబర్దస్త్ షో ద్వారా అనసూయ ఎంతో క్రేజ్ ను సంపదించుకుంది. ఈ షో లో అనసూయ అందాల ప్రదర్శన కు ఎంతోమంది అభిమానులు అయ్యారు. జబర్దస్త్ తరవాత అనసూయ కు జబర్దస్త్ బ్యూటీ అనే పేరు వచ్చింది.

Advertisement

ఇక ఈ షో తో వచ్చిన క్రేజ్ వల్ల ఆ తరవాత చాలా షో లలో సందడి చేసింది. అంతే కాకుండా సినిమా ఆఫర్ లను సైతం అందుకుంది. క్షణం సినిమాలో ఆఫర్ రావడం తో ఆ సినిమా లో అధ్బుతమైన నటన తో ఆశ్చర్యపరిచింది. అంతే కాకుండా తరవాత రామ్ చరణ్ సుకుమార్ కాంబో లో వచ్చిన రంగస్థలం లో నటించే ఛాన్స్ దక్కించుకుంది.

Advertisement

jabardasth anasuya

jabardasth anasuya

ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం తో పాటు అనసూయ చేసిన రంగమ్మత్త పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇదిలా ఉంటే అనసూయ డ్రెస్సింగ్ పై ఆమె సినిమాలో చేసిన పాత్రల పై ట్రోల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆ విషయం అనేక సార్లు అనసూయ స్పందించింది.

ఇక తాజాగా మరోసారి ఆ టాపిక్ పై సోషల్ మీడియా వేదికగా స్పందించింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో షారుఖ్ ఖాన్ మేము సినిమాల్లో చేసే పాత్రలు కేవలం నటన మాత్రమే….అదే మా క్యారెక్టర్ కాదు అంటూ చెప్పారు. ఇక అదే వీడియో ను అనసూయ షేర్ చేసింది. అంతే కాకుండా ఆ వీడియో కు …ఈ విషయమే నేను చాలా కాలం గా మొత్తుకుంటున్నా మేము నటిస్తున్నది కేవలం సినిమాలో. అవే మా రియల్ క్యారెక్టర్ కు కావు. అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

Advertisement

Also read :“నరసింహ నాయుడు” సినిమాను ఆ రియల్ స్టోరీ ఆధారంగా తీసారని తెలుసా? ఎక్కడ జరిగిందంటే?