Telugu News » Blog » నేనేమీ ఒకేసారి మూడు పెళ్ళిళ్ళు చేసుకోలేదు….బాలయ్య షో లో పవన్ సెన్సేషనల్ కామెంట్స్..!

నేనేమీ ఒకేసారి మూడు పెళ్ళిళ్ళు చేసుకోలేదు….బాలయ్య షో లో పవన్ సెన్సేషనల్ కామెంట్స్..!

by AJAY
Ads

పవన్ కళ్యాణ్ బాలయ్య అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న అన్ స్టాపబుల్ ఎపిసోడ్ ప్రసారం అవుతోంది. ఇక ఈ ఎపిసోడ్ లో బాలయ్య అడిగే ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ ఆసక్తికర సమాధానాలు చెప్పారు. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ ఈ పెళ్లిళ్ళ గోల ఏంటి భయ్యా అంటూ పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించాడు. దానికి పవన్ కళ్యాణ్ సమాధానం ఇస్తూ….

Advertisement

జీవితంలో నేను అసలు పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను. బ్రహ్మచారిగానే ఉండాలని నిర్ణయించుకున్నాను అంటూ షాకింగ్ కామెంట్ చేశారు. కానీ ఏం చేస్తాం అలా జరిగిపోయింది అని చెప్పారు. రాజకీయాల్లో చాలామంది తనను పెళ్లిళ్ల విషయంలోనే టార్గెట్ చేస్తున్నారని అన్నారు. కానీ నేనేమీ ఒకేసారి మూడు పెళ్లిళ్లు చేసుకోలేదు… ఒకేసారి ముగ్గురితో కలిసి ఉండటం లేదే అని చెబుతున్నా వినిపించుకోరు అంటూ మండిపడ్డారు.

Advertisement

ఒకరితో నాకు కుదరదు అని అనుకున్నప్పుడు నేను విడాకులు ఇచ్చి చట్టబద్ధంగా మరో పెళ్లి చేసుకున్నాను అని చెప్పారు. అంతే తప్ప వ్యామోహంతో చేసుకోవడం లేదని అన్నారు. నన్ను టార్గెట్ చేయడానికి మరో అంశం లేకపోతే అవతల వారు మాత్రం ఏం చేస్తారు పాపం అని అన్నారు. ఈ విషయంపై ఘాటుగా స్పందించడానికి నాకు నా సంస్కారం సభ్యత అడ్డు వస్తున్నాయి అంటూ చెప్పుకొచ్చారు.

అందువల్లే నా పని నేను చేసుకుంటున్నాను అంటూ పవన్ సమాధానం ఇచ్చారు. దాంతో పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల గురించి ఎవరు మాట్లాడినా….. అంటూ బాలయ్య సీరియస్ ఎక్స్ప్రెషన్స్ తో హెచ్చరించారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ను అధికార పార్టీ నాయకులు చాలాసార్లు మూడు పెళ్లిళ్ల విషయంపై విమర్శించిన సంగతి తెలిసిందే. దాంతో గతంలోనూ పవన్ కళ్యాణ్ తన పెళ్లిళ్లపై స్పందించారు.

Advertisement

Also read : అల్లు అరవింద్ కు ఇంకో కొడుకు ఉన్నాడా.. షాకిచ్చిన శిరీష్!