Home » ఆ నటుడి చెంప చెల్లుమనిపించిన హీరోయిన్ ఎవరో తెలుసా ?

ఆ నటుడి చెంప చెల్లుమనిపించిన హీరోయిన్ ఎవరో తెలుసా ?

by Anji
Ad

సాధారణంగా ఘర్షణలు ప్రతీ చోటా జరుగుతుంటాయి. ఇక సినిమా ఫీల్డ్ లో అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. సినిమాల్లో ఘర్షణలు జరిగిన మాదిరిగానే సినిమా సెట్స్ లో కూడా ఘర్షణలు జరుగుతుంటాయి. అవి మితిమీరిపోతేనే ఎక్కడ లేని తలనొప్పులు వస్తాయి. హీరోయిన్, డ్యాన్సింగ్ క్వీన్ నోరా ఫతేహి తన మొదటి సినిమా షూటింగ్ లోనే గొడవపడిందట. రోర్ : టైగర్స్ ఆఫ్ ది సుందర్భన్స్ చిత్రంతో 2014లో వెండితెరకు పరిచయమైంది నోరా. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో తనకు ఎదురైన ఓ చేదు ఘటనను గతంలో ఓ షోలో వెల్లడించగా.. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also Read :  అంత అందం ఉన్న బాలయ్య కూతుర్లు హీరోయిన్స్ కాకపోవడానికి కారణం ఆ ఒక్కటేనా..?

Advertisement

నోరా మాట్లాడుతూ..  “బంగ్లాదేశ్ లోని సుందర్బన్స్ అడవులలో రోర్ షూటింగ్ జరుగుతున్నసమయంలో ఓ నటుడు నాతో అనుచితంగా ప్రవర్తించాడు. నాకు కోపం వచ్చి వెంటనే అతని చెంప చెల్లుమనిపించాను. దీంతో అతను కూడా తిరిగి నన్ను కొట్టాడు. నేను మళ్లీ తిరిగి అతన్ని కొట్టాను. అతను నా జుట్టు పట్టుకొని మరీ లాగాడు. నేను కూడా అతని జుట్టు లాగాను. అందరూ చూస్తుండగానే మేము ఇద్దరం కొట్టేసుకున్నాం. వెంటనే దర్శకుడు జోక్యం చేసుకొని మమ్మల్ని ఆపాడు”  అని వెల్లడించింది.  ఇక ఆమె చెప్పిందిన విని అక్కడ ఉన్నటువంటి అర్చన పూరన్ సింగ్, కపిల్, ఆయుస్మాన్ అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. నోరా మాత్రం ఆ సంఘటన గురించి చెబుతున్నంత సేపు పడీ పడీ నవ్వుతూనే ఉంది.

Advertisement

Also Read :  ఏసీసీ మెన్స్ ఛాలెంజర్ కప్-2023లో రికార్డు స్కోరు.. భారీ విజయం..!

Nora Fatehi reveals the beauty and style essentials she carries during her  travels : Bollywood News - Bollywood Hungama

ఇది మాత్రం నెటిజన్లకు అస్సలు మింగుడు పడలేదు. నువ్వు ఏమైనా జోక్ చేబుతున్నావా..? ఎందుకు నవ్వుతున్నావు..? ఇదేదో కామెడీ అనుకుంటుందా ? ఏంటీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల కపిల్ శర్మ షోలో మరోసారి మెరిసింది నోరా. అప్పుడు కూడా ఆమె చేసిన వ్యాఖ్యలు అభిమానులకు ఏమాత్రం నచ్చలేదు. ముఖ్యంగా డేటింగ్ కి వెళ్లినప్పుడు తాను బిల్లు చెల్లించనని చెప్పింది. ఇప్పుడు లోకం మారిందని.. అమ్మాయిలు కూడా బిల్లు చెల్లిస్తున్నారని అర్చన చెప్పగా.. నువ్వు కట్టుకో నేను మాత్రం బిల్లు కట్టను అని దురుసుగానే మాట్లాడింది. ఇక నోరా విషయానికొస్తే.. టెంపర్, బాహుబలి: ది బిగినింగ్, కిక్ 2, ఊపిరి, లోఫర్ వంటి సినిమాలలో స్పెషల్ సాంగ్స్ తో ఓ ఊపు ఊపేసింది.  ప్రస్తుతం  జాన్ అబ్రహం షెహనాజ్ గిల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న 100 %  సినిమాలో నటిస్తోంది నోరా.

Also Read :  కేటీఆర్ ముందరే.. సుడిగాలి సుధీర్ పరువు తీసేసిన ఆటో రాంప్రసాద్..!

Visitors Are Also Reading