Home » RRR 2 కి దర్శకత్వం వహించేది ఎవరో తెలుసా ? జక్కన్న ప్లాన్ మామూలుగా లేదుగా..!

RRR 2 కి దర్శకత్వం వహించేది ఎవరో తెలుసా ? జక్కన్న ప్లాన్ మామూలుగా లేదుగా..!

by Anji
Ad

దర్శక ధీరుడు రాజమౌళి ఇటీవలే RRR  మూవీతో తన స్థాయిని అమాంతం గ్లోబల్ రేంజ్ లో పెంచుకున్నాడు. ప్రధానంగా తెలుగు సినిమాకి అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానాన్ని జత చేసి క్రియేటివ్ జీనియస్ అనిపించుకున్నాడు రాజమౌళి. బాహుబలి సిరీస్ తో టాలీవుడ్ సత్తా ఏంటో ప్రపంచానికి చాటి చెప్పి.. తెలుగు వారు గర్వపడేవిధంగా చేశారు. ఆర్ఆర్ఆర్ మూవీతో ప్రపంచ బెస్ట్ డైరెక్టర్స్ స్టీవెన్ స్పీల్ బర్గ్, జేమ్స్ కెమారూన్ సైతం ఆశ్చర్యపోయే విధంగా చేసి తెలుగు ప్రేక్షకులు కాలర్ ఎగరేసుకునేవిధంగా చేశారు. తెలుగు సినిమా ఆస్కార్ ఎంట్రీ సాధిస్తుందా..? మన సినిమాకి ఆస్కార్ వస్తుందా..? కలలో కూడా అస్సలు ఊహించలేదు అనుకుంటే.. అకాడమీ అవార్డు గెలిచి చూపించారు.RRR  మూవీతో క్రియేట్ చేసిన సెన్షేషన్ అంతా ఇంతా కాదు. ఇప్పుడిప్పుడే ఆ ఫీవర్ నుంచి బయటికి వచ్చి కొత్త సినిమా పనులను ప్రారంభించబోతున్నారు. 

Advertisement

ఇటీవలే రాజమౌళి తండ్రి సీనియర్ రచయిత విజయేంద్రప్రసాద్ RRR 2 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.RRR 2 ని రాజమౌళి తీయకపోవచ్చని.. RRR రాజమౌళి, రామ్ చరణ్, రామారావు ముగ్గురూ లేని మూవీని అసలు ఊహించగలమా..? దర్శక ధీరుడు కాబట్టే బిగ్ స్కేల్ మీద అద్భుతంగా కథ చెప్పగలిగారు. తారక్, చరణ్ కూడా అద్భుతంగా నటించారు. అసలు వాళ్లిద్దరూ అంతా సమయం కేటాయించి చెప్పింది చెప్పినట్టు చేసుకెళ్లారంటే.. అది కేవలం ఒక్క జక్కన్న లేకుండా సీక్వెలా..? ఆయనకి బదులు ఎవ్వరూ డైరెక్ట్ చేస్తారు ? అంటే ఎస్.ఎస్. కార్తికేయ పేరు వినిపిస్తోంది. రాజమౌళి దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కబోయే RRR2 తో కార్తికేయ దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. 

Advertisement

 కార్తికేయ, రాజమౌళి మూవీస్ కి డైరెక్షన్ డిపార్టుమెంట్ లో వర్క్ చేస్తూ.. ఆయనకు రెడ్ హ్యాండెడ్ గా ఉంటున్నాడు. అదేవిధంగా బాహుబలి కి సెకండ్ యూనిట్ దర్శకునిగా చేశాడు. విదేశాల్లో RRR సీక్వెల్ అంటే అది కచ్చితంగా కార్తికేయ డైరెక్ట్ చేశాడని అంటున్నారు. కార్తికేయకు కుదరకపోతే బాలీవుడ్ డైరెక్టర్, బ్రహ్మాస్త్ర ఫేమ్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తాడని టాక్ వినిపిస్తోంది. బ్రహ్మాస్త్ర విడుదల అప్పుడు అయాన్ వర్క్ చూసి ఇంప్రెస్ అయిన రాజమౌళి.. తన లాంటి మరో సినిమా పిచ్చోడు అయాన్ అని చెప్పారు. ఇప్పటివరకు వస్తున్న వార్తల ప్రకారం.. తెలిసిన సమాచారం ప్రకారం.. జక్కన్న లేని RRR సీక్వెల్ దర్శకత్వ బాధ్యతలు కార్తికేయ, అయాన్ ఇద్దరిలో ఎవరో ఒకరు తీసుకోనున్నారని ఫిలిం వర్గాల టాక్ వినిపిస్తోంది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

ఆసియా కప్ కి లైన్ క్లియర్.. ఇండియా-పాక్ మ్యాచ్ ఎక్కడంటే?

మ్యాట్రిమొనీలో ఏరి కోరి మరీ పెళ్లి చేసుకున్నాడు.. భార్య గురించి తెలిసి ఆశ్చర్యపోయాడు..!

 

Visitors Are Also Reading