Home » ఎన్టీఆర్, ఏఎన్నార్ కూర్చుంటే కుర్చీపై కూర్చొన్న నిర్మాతలు ఎవరో తెలుసా ?

ఎన్టీఆర్, ఏఎన్నార్ కూర్చుంటే కుర్చీపై కూర్చొన్న నిర్మాతలు ఎవరో తెలుసా ?

by Anji
Ad

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ ప్రస్తుతం ఈ పొజిషన్ లో ఉందంటే దానికి ఎంతో కొంతో ఎన్టీఆర్, ఏఎన్నార్ కారణమని చెప్పొచ్చు. సినిమా ఇండస్ట్రీ మద్రాస్ లో ఉన్న సమయంలో నటులుగా మంచి గుర్తింపు సంపాదించుకొని ఆ తరువాత ఇండస్ట్రీని హైదరాబాద్ కి తరలించడంలో వీరి కృషి చాలా ఉంది. అలాంటి ఎన్టీఆర్, ఏఎన్నార్ అప్పట్లో హీరోలుగానే కాకుండా పేద ప్రజలకు దేవుడిలా ఉండేవారు. తెలుగు సినీ ఇండస్ట్రీ చరిత్రను తిరగరాసిన పెద్ద హీరోలు వీరు. అలాంటి వీరు సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలో చాలా రిస్ట్రిక్షన్స్ ఉండేవట. అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

ప్రస్తుత కాలంలో హీరో, హీరోయిన్లు ఒక హిట్ పడిందంటే.. చాలు రెమ్యునరేషన్ పెంచేస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. కానీ అప్పట్లో దర్శక, నిర్మాతలు చెప్పిందే వేదం. దర్శక,నిర్మాతలను హీరో, హీరోయిన్లు గౌరవిస్తూ భయంతో మెదిలేవారట. పారితోషికం కూడా వారే నిర్ణయించేవారట. వారు ఎంత ఇస్తే అంత తీసుకొని ఎన్టీఆర్, ఏఎన్నార్ చేసిన సినిమాలు అనేకం ఉన్నాయని అందరికీ తెలుసు. ఏఎన్నార్ మాయాబజార్, ఆరాధన, దొంగ రాముడు, అర్దాంగి, దసరా బుల్లోడు, భార్యభర్తలు ఇలా ఎన్నో బ్లాక్ బస్టర్ వంటి సినిమాలను తెలుగు ఇండస్ట్రీకి అందించిన గొప్ప హీరోలు వీరు. ముఖ్యంగా మద్రాస్ నుంచి సినిమా ఇండస్ట్రీని హైదరాబాద్ కి తీసుకొచ్చిన తరువాత అన్నపూర్ణ స్టూడియో నిర్మించి ఇండస్ట్రీకి గుర్తింపు తీసుకొచ్చిన మహానుభావుడు నాగేశ్వరరావు.

Advertisement

సీనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే.. నటన పరంగా ఆయన చేయని పాత్ర అంటూ లేదు. తెలుగు ప్రజలకు ఓ దేవుడిలా మారారు ఎన్టీఆర్. కేవలం సినిమాల్లోనే కాదు.. తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి కోసం ఎంతో సహకరించాడు. ఇలా ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇండస్ట్రీలో అంతటి గొప్ప స్థాయికి చేరుకోవడానికి ప్రధాన కారణం నటన టాలెంట్ తో పాటు తన సహనటులతో స్నేహ పూర్వకంగా ఉండి తనకంటే పెద్ద నటులను ఎంతగానో గౌరవించేవారట. దానికి ప్రధాన ఉదాహరణ ఈ ఫొటోనే. ఈ ఫొటోలో నిర్మాతలు బి.ఎన్.రెడ్డి, నాగిరెడ్డి కుర్చీలో కూర్చోగా.. వారి ముందు నేలపై ఎన్టీఆర్,  ఏఎన్నార్ మరియు ఇతర నటులు కూర్చుకున్నారు. ప్రస్తుతం ఈ అరుదైన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

బాలకృష్ణ సూపర్ హిట్ మూవీలో ఛాన్స్ మిస్ చేసుకున్న సాయిపల్లవి.. ఏదో తెలుసా?

ఎన్టీఆర్ మూవీ ఫ్లాప్ కావడంతో ట్యాంక్ బండ్ లో దూకిన నిర్మాత.. అతను ఎవరంటే..?

వైస్రాయ్ ఘటన తరువాత రోజు పురంధేశ్వరితో ఎన్టీఆర్ ఏమన్నారో తెలుసా ?

Visitors Are Also Reading