Home » పదోతరగతి పేపర్ లీక్ గురించి వరంగల్ సీపీ ఏమన్నారో తెలుసా ?

పదోతరగతి పేపర్ లీక్ గురించి వరంగల్ సీపీ ఏమన్నారో తెలుసా ?

by Anji
Ad

తెలంగాణ రాష్ట్రంలో గత కొద్ది రోజుల నుంచి వరుస పేపర్ లీక్ వ్యవహారం కొనసాగుతున్న విషయం తెలిసిందే. మొన్న, నిన్న పదోతరగతి తెలుగు, హిందీ పేపర్లు వరుసగా సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో పోలీసులు నిఘా ఉంచారు. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ని పోలీసులు మంగళవారం అర్దరాత్రి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో వరుస పేపర్ లీకులు సంచలనం రేకెత్తిస్తున్న  సందర్భంలోనే బండి సంజయ్ అరెస్ట్  చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది.  పేపర్ లీక్ పై  బండి సంజయ్ అరెస్ట్ చేయడం పై వరంగల్ సీపీ రంగనాథ్ మీడియా సమావేశం నిర్వహించారు. అరెస్ట్ కి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. 

Also Read :  రోడ్డు మీద దొరికిన డ‌బ్బు జేబులో వేసుకుంటున్నారా..? అలా చేస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా..?

Advertisement

 బండి సంజయ్ కంటే ముందే ఈటలకు ప్రశ్నాపత్రం పంపించారు.  బీజేపీ పై కుట్ర ఉంటే సంజయ్ నే ఎందుకు అరెస్ట్ చేస్తాం.. మిగతా బీజేపీ నాయకులపై మేము ఎందుకు కేసులు పెట్టలేదు అని పేర్కొన్నారు సీపీ రంగనాాథ్.   సంజయ్ ఫోన్ లో మరింత సమాచారం ఉంటుందని , అతని  డైరెక్షన్ లో నే లీకేజీ అంతా జరిగిందని.. పరీక్షలను రద్దు చేయించాలనే దురుద్దేశం కనిపిస్తోందని తెలిపారు. చాట్స్, కాల్ డేటా వస్తే చాలా విషయాలు  వెలుగులోకి వస్తాయి.  అసలు బండి సంజయ్ ఫోన్ ఎందుకు దాస్తున్నారని.. నిర్దోషి అయితే ఫోన్ దాయాల్చిన అవసరం ఏంటి అని ప్రశ్నించారు. పేపర్ లీక్ కంటే ముందు రోజే బండి సంజయ్ ప్రశాంత్ చాట్ చేసుకున్నారు. ఈ చాట్ ఆధారంగానే బండి సంజయ్ ని ఏ1గా నమోదు చేశామని సీపీ వెల్లడించారు. 

Advertisement

Also Read :  IPL 2023 : అయ్యో కేన్ మామ…క్రికెట్ మొత్తానికి దూరం కాబోతున్నాడా ?

Manam News

ఫస్ట్ రోజు తెలుగు బిట్ పేపర్ కూడా బయటికి వచ్చింది. ప్రశాంత్, మహేష్ చాలా మందికి ప్రశ్నాపత్రాలను పంపించారు. ఈటల రాజేందర్ తో పాటు ఆయన పీఏలకు కూడా పంపించారు. పేపర్ లీకేజీ అంతా ఓ గేమ్ లా ప్లాన్  చేశారు. ప్లాన్ ప్రకారమే పేపర్లను లీకు చేశారు. బండి సంజయ్ ఫోన్ ఇచ్చి ఉంటే చాలా విషయాలు తెలిసేవి. సెక్షన్ 41 ప్రకారం.. వారెంట్ లేకుండా ఎవరినైనా అరెస్టు చేసే అధికారం ఉంటుంది. ప్రశాంత్, బండి సంజయ్ మధ్య ఫోన్ కాల్స్ నడిచాయి. ఫోన్ అడిగితే బండి సంజయ్ లేదని చెప్పారు. ప్రశాంత్ ని మంగళవారమే అరెస్టు చేశామని.. అతను చాలా మందికి పేపర్ ఫార్వార్డ్ చేసినట్టు తేలిందని సీపీ రంగనాథ్ వెల్లడించారు. 

Also Read :  ఎండకాలంలో నిమ్మకాయ తింటే మంచిదేనా ? ఎలా వాడాలో తెలుసుకోండి

Visitors Are Also Reading