Home » చంద్రబాబు అరెస్ట్ పై టాలీవుడ్ దర్శకుడు రాఘవేంద్రరావు ఏమన్నారో తెలుసా ?

చంద్రబాబు అరెస్ట్ పై టాలీవుడ్ దర్శకుడు రాఘవేంద్రరావు ఏమన్నారో తెలుసా ?

by Anji

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ని పోలీసులు అరెస్ట్ చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ కుంభకోణంలో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నంద్యాలలో బస చేసిన ఆర్.కె.ఫంక్షన్ హాల్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్నారు పోలీసులు. ఇవాళ ఉదయం 6 గంటలకు అరెస్ట్ చేశారు. చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు కాలువ శ్రీనివాసులు, భూమా బ్రహ్మానందరెడ్డి, భూమా అఖిల ప్రియ, జగత్ విఖ్యాత్ రెడ్డి, ఏవీ సుబ్బారెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి వంటి నేతలను కూడా అరెస్టు చేశారు పోలీసులు. సీఆర్పీసీ సెక్షన్ 50 (1) కింద ఆయనకు నోటీసు ఇచ్చి అరెస్ట్ చేసినట్టు వెల్లడించారు పోలీసుడు. అరెస్ట్ అయిన చంద్రబాబును రోడ్డు మార్గం ద్వారా తన సొంత కాన్వాయ్ లోనే విజయవాడకు వచ్చేందుకు సీఐడీ అధికారులు అంగీకరించారు. 

ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుపై విమర్శల వర్షం కురుస్తోంది. ముందస్తుగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ ఎలా చేస్తారంటూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సీఎం జగన్ లండన్ నుంచే ఈ డ్రామాకు శ్రీకారం చుట్టారని.. రాజకీయ కక్షతోనే చంద్రబాబుకు అవినీతి మరకలు అంటించాలని తాపత్రయ పడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు లండన్ పర్యటనలో జగన్ ఏం చేశారనే విషయం బయటకు రాకుండా ఉండేందుకు, ప్రజల దృష్టి మరల్చేందుకు వైసీపీ ప్రభుత్వం పెద్ద డ్రామాకు తెరతీసిందని మండిపడుతున్నారు. అసలు ఒక కేసులో పూర్తి విచారణ లేకుండా.. ఛార్జిషీట్ దాఖలు చేయకుండా.. అరెస్టుపై ముందస్తు సమాచారం లేకుండా పోలీసులు ఎలా వ్యవహరిస్తారని మండిపడుతున్నారు.మరోవైపు చంద్రబాబు అరెస్ట్ విషయంలో కేంద్ర ప్రభుత్వ హస్తం కూడా ఉండవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేయించే ధైర్యం జగర్ కి లేదని పలువురు ఆరోపిస్తున్నారు. బాబాయ్ Ha*  కేసులో అరెస్టు కాకుండా కాపాడుతున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రాథమిక ఆధారాలు లేని కేసులో చంద్రబాబును ఎలా అరెస్ట్ చేయిస్తారని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

తాజాగా ప్రముఖ సిని దర్శకుడు రాఘవేంద్రరావు ఖండించారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యం అపహాస్యమైందని మండిపడ్డారు. ఓ విజనరీ లీడర్ అయిన చంద్రబాబును అరెస్ట్ చేసిన విధానం అప్రజాస్వామికమని పేర్కొన్నారు. ఏపీలో ప్రజాస్వామ్యం అపహాస్యం అయింది. ఒక విజనరీ లీడర్ అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన విధానం అప్రజాస్వామికం అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహాలన్నీ కూడా తాను రాసిన రాజ్యాంగం చచ్చిపోతున్నందుకు బాధ పడుతున్నాయి అని   సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ చేశారు దర్శకుడు రాఘవేంద్రరావు.  

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 రీ రిలీజ్ కు సిద్ధమైన ఎన్టీఆర్ సూపర్ హిట్ మూవీ.. ఎప్పుడంటే..?

ఒత్తిడిలో టాలీవుడ్ స్టార్ దర్శకుడు.. ఆ హీరో సినిమానే కారణమా ? 

Visitors Are Also Reading