Home » రీ రిలీజ్ కు సిద్ధమైన ఎన్టీఆర్ సూపర్ హిట్ మూవీ.. ఎప్పుడంటే..?

రీ రిలీజ్ కు సిద్ధమైన ఎన్టీఆర్ సూపర్ హిట్ మూవీ.. ఎప్పుడంటే..?

by Anji
Ad

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో రీ రిలీజ్ సినిమాల హవా కొనసాగుతున్న విషయం విధితమే. ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి హీరోల సినీ కెరీర్ లో ది బెస్ట్ మూవీగా ఉన్నటువంటి సినిమాలను తిరిగి ప్రేక్షకుల ముందుకు 4k వెర్షన్లు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఎన్నో సినిమాలు ప్రేక్షకులు ముందుకు తిరిగి సంచలనమైనటువంటి విజయాలను అందుకున్న విషయం తెలిసిందే. అయితే తొలుత డిజాస్టర్ గా నిలిచిన సినిమాలు కూడా ఇప్పుడు మంచి కలెక్షన్లను రాబట్టడంతో దర్శక,నిర్మాతలు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement

ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ నటించిన పలు సినిమాలు తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశాయి. తాజాగా మరో మూవీ కూడా తిరిగి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అంటూ సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో నటించిన సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమా అదుర్స్.. ఈ చిత్రంలో భట్టుచారి పాత్రల్లో ఎన్టీఆర్ బ్రహ్మానందం కామెడీ చాలా అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి సంచలనమైనటువంటి విజయాన్ని అందుకుంది. 

Advertisement

ఒకప్పుడు థియేటర్లలో ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తున్నటువంటి అదుర్స్ సినిమా తిరిగి ప్రేక్షకుల ముందుకు రావడనికి సిద్ధమవుతుందనే వార్త వైరల్ గా మారింది. ఈ చిత్రం 4K  వెర్షన్ లో నవంబర్ నెలలో విడుదలకు సిద్ధం కాబోతుందని తెలుస్తోంది. ఈ సినిమా విడుదల కాబోతుందనే విషయం తెలియడంతో అభిమానులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీ రీ రిలీజ్ గురించి ఇంకా నిర్మాతలు కూడా ఎక్కడ అధికారికంగా ప్రకటించలేదు. ఈ మూవీ తిరిగి ప్రేక్షకుల ముందుకు వస్తుందనే విషయం నిజమైతే మరోసారి తెరపై భట్టు, చారి కామెడీతో ప్రేక్షకులను మరోసారి నవ్వించబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమా షూటింగ్ పనులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

చంద్రముఖి 2 రిలీజ్ డేట్ లో మార్పు… ఇప్పుడు పోటీ మాములుగా లేదు కదా..?

 ఐకాన్ స్టార్ తో అట్లీ సినిమా.. అధికారిక ప్రకటన కూడా అప్పుడే..!

 

Visitors Are Also Reading