Home » సమంత 16 ఏళ్ల వయసు ఫోటోలు మీరు చూసారా.. ఎంత అందమంటే..!!

సమంత 16 ఏళ్ల వయసు ఫోటోలు మీరు చూసారా.. ఎంత అందమంటే..!!

by Sravanthi Pandrala Pandrala
Ad
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన అంద చందాలతో నటన చాతుర్యంతో  ఎంతో గుర్తింపును సాధించింది  సమంత.  ఇప్పటికే ఆమె నటించిన ఎన్నో సినిమాలు బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాయి. దాదాపు సౌత్ ఇండస్ట్రీ లో ఉన్నటువంటి అందరు అగ్ర హీరోలతో ఆమె నటించింది. అలాంటి సమంత ఇప్పటికి తరగని అందంతో  దూసుకుపోతోంది. మరి సమంత పదహారేళ్ళ వయసులో ఉన్నప్పుడు  ఎంత అందంగా ఉందో మనం ఇప్పుడు చూసేద్దామా..
 స్టార్ హీరోయిన్ సమంత సినిమాల్లో బిజీగా ఉండడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది. తనకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ  అభిమానులను ఆశ్చర్యపరుస్తుంది.  అయితే తాజాగా ఈమె ఇన్స్టా వేదికగా తన 16 సంవత్సరాలు ఉన్నప్పుడు ఉన్నటువంటి ఫోటోను అభిమానులతో పంచుకుంది. ఆ వయసులో కూడా సమంత చాలా అందంగా  కుందనపు బొమ్మలా కనిపిస్తోంది. బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో  సమంత చిన్న ఫ్రాక్  మరియు శ్రాగు వేసుకొని ఉంది. సోపాల్లో కూర్చున్న ఈమె  ఒక చేయిని తలకు పెట్టుకొని  అప్పుడే సినిమా రేంజ్ లో స్టిల్ ఇచ్చింది.
 ప్రస్తుతం ఈ ఫోటోని చూసినా ఆమె అభిమానులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.  18 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా ఆ విధంగానే ఉన్నావంటూ కామెంట్లు పెడుతున్నారు. వయసు పెరిగే కొద్దీ నీ అందం కూడా పెరుగుతుంది అంటూ  అంటున్నారు. ఏది ఏమైనా సమంత అందానికి  ఎంతటి వ్యక్తులైన మంత్రముగ్ధులు కావాల్సిందే. సమంత ఈ మధ్యకాలంలో  కాస్త అనారోగ్యం బారిన పడి మళ్లీ కోలుకుంది. తాజాగా విడుదలైన శాకుంతలం మూవీ  ప్లాప్ అయింది  . మరి రాబోయే ఖుషి సినిమా అయినా హిట్ ఇస్తుందా లేదా అనేది ముందు ముందు తెలుస్తుంది.

Advertisement

Visitors Are Also Reading