Home » అనిల్ రావిపూడి సినిమాలో విలన్ గా నటిస్తున్న అర్జున్ రాంపాల్ బాలయ్య గురించి ఏమన్నారో తెలుసా ?

అనిల్ రావిపూడి సినిమాలో విలన్ గా నటిస్తున్న అర్జున్ రాంపాల్ బాలయ్య గురించి ఏమన్నారో తెలుసా ?

by Anji
Ad

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా రూపుదిద్దుకుంటున్న విషయం విధితమే. ఈ మూవీకి టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. బాలకృష్ణ నటిస్తున్న 108వ సినిమా కావడంతో NBK108  అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో బాలయ్య కి జోడీగా అందాల చందమామగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. యంగ్ హీరోయిన్ శ్రీలీల కీలక పాత్ర పోషిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ మూవీని నిర్మిస్తున్నారు. 

Also Read :  80 ఏళ్లలో కూడా తండ్రి అయిన స్టార్ హీరో.. ఎన్నోసారి అంటే ?

Advertisement

ఇదిలా ఉండగా.. ఈ మూవీ నుంచి ఓ కీలక అప్డేట్ ఇచ్చారు దర్శక నిర్మాతలు. ఈ మూవీలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ ను దించారు. తాజాగా ఆయన షూట్ లో పాల్గొన్నారు. అర్జున్ రాంపాల్ కి స్వాగతం చెబుతూ ఓ వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వీడియో దర్శకుడు అనిల్ రావిపూడి ఉన్నారు. ఫ్లూట్ జింక ముందు ఊదు.. సింహం ముందు కాదు అంటూ బాలయ్య డైలాగ్ తో ఈ వీడియోలో ఎంట్రీ ఇచ్చారు అర్జున్ రాంపాల్. బాలయ్య డైలాగ్ కి ఆశ్చర్యపోయిన అనిల్ రావిపూడి.. సూపర్ ఇరగదీసేశారు. తెలుగు డైలాగ్ అందులో బాలయ్య డైలాగ్  అద్భుతమని చెప్పారు. ఈ అవకాశం ఇచ్చినందుకు బాలయ్య బాబు థాంక్యూ అంటూ అర్జున్ రాంపాల్ ధన్యవాదాలు తెలిపారు.  

Advertisement

Also Read :   Samantha : కోట్లు పెట్టి.. హైదరాబాద్ లో మరో లగ్జరీ హౌస్ కొనేసిందిగా..?

ఇప్పటివరకు ఎన్నడూ చూడని పాత్రలో నటిస్తున్నా బాలయ్య. ఈ మూవీలో డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారు. బాలయ్య మార్క్ యాక్షన్, మాస్ ఎలిమెంట్స్, అనిల్ రావిపూడి మార్క్ కామెడీ ఈ చిత్రంలో ఉండబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాకి బాలయ్య గత రెండు సినిమాలకు సంగీతం అందించినటువంటి థమన్ NBK108 కి సంగీతం సమకూర్చుతున్నారు. సి.రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. తమ్మిరాజు ఎడిటర్ గా, రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు. వి.వెంకట్ యాక్షన్ సీన్లు డిజైన్ చేస్తున్నారు. ముఖ్యంగా దర్శకుడు అనిల్ రావిపూడి కచ్చితంగా బాలయ్యకి హిట్ ఇస్తారని.. నందమూరి అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. 

Also Read :  చిరంజీవి హీరోయిన్ ఇప్పుడు వేలకోట్లకు అధిపతి.. ఎవరంటే..?

Visitors Are Also Reading