Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » చిరంజీవి హీరోయిన్ ఇప్పుడు వేలకోట్లకు అధిపతి.. ఎవరంటే..?

చిరంజీవి హీరోయిన్ ఇప్పుడు వేలకోట్లకు అధిపతి.. ఎవరంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ads

ఒకప్పుడు చిరంజీవి సరసన నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ హీరోయిన్. చిన్నతనం నుంచే భరతనాట్యం ఇష్టపడే ఈ హీరోయిన్ వెయ్యికి పైగా ప్రదర్శనలు ఇచ్చింది. సినిమా ఇండస్ట్రీకి వస్తాను అనుకోలేదట. కానీ అబిడ్స్ లో స్టామిని స్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న సమయంలో ఒక ప్రదర్శన ఇచ్చింది. ఈ తరుణంలో దర్శకరత్న దాసరి నారాయణరావు కంటపడింది. ఇంకేముంది ఆమె స్టార్ హీరోయిన్ గా మారింది. ఇంతకీ ఆమే ఎవరయ్యా అంటే హీరోయిన్ మాధవి. దాసరి డైరెక్షన్లో తూర్పు పడమర సినిమా చేసి సినీ పరిశ్రమకు పరిచయమైంది.

Advertisement

also read:Asia Cup 2023: ఆసియా కప్ 2023 నుంచి పాకిస్తాన్ ఔట్‌ ?

Ad

ఇక ఈ సినిమా హిట్టుతో ఆమె వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆమె 17 సంవత్సరాల వయసులో తెలుగు, తమిళ్, కన్నడ,హిందీ, ఒరియా, భాషలో దాదాపు 300 పైగా చిత్రాలు నటించింది. మాధవి 80,90 దశకాల్లో గ్లామర్ హీరోయిన్ కి చిరునామాగా మారింది. అప్పట్లోనే బిజీ హీరోయిన్ గా ఉన్న చిరంజీవి మాధవి కాంబో హిట్ కాంబో గా పేరు తెచ్చుకుంది. వారిద్దరు కలిసినటించిన కోతల రాయుడు, చట్టానికి కళ్ళు లేవు, దొంగ మొగుడు, ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య వంటి చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్మురేపాయి.

Advertisement

also read:80 ఏళ్లలో కూడా తండ్రి అయిన స్టార్ హీరో.. ఎన్నోసారి అంటే ?

మాధవి వ్యక్తిగత జీవితం కూడా అనూహ్యమైన మలుపు తిరిగింది. మాధవి ఆధ్యాత్మిక గురువు రామస్వామి శిష్యురాలు కావడంతో ఆయన సలహాతో ఆయన శిష్యుడైన జర్మన్ మూలాలు ఉన్న భారతీయుడు ఆయన రాజ్ శర్మను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత అమెరికాలో సెట్ అయింది. రాజు శర్మకు పెద్ద ఫార్మసీటికల్ కంపెనీ ఉంది. మాధవి కూడా బిజినెస్ లో భర్తకు సాయం చేస్తూ సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం వీరి ఆస్తుల విలువ పాతిక వేల కోట్లకు పైగానే ఉంటుందని సమాచారం. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన మాధవి టాలెంట్ తో ఇంతటి సక్సెస్ సాధించిందని చెప్పవచ్చు.

also read:Telangana Tenth Results: పది ఫలితాలు.. ఆ స్కూళ్లలో ఎవరు పాస్ కాలేదట..!

Visitors Are Also Reading