Home » పెళ్లి చేసుకుంటానన్న అభిమాని.. మృణాల్ ఆన్సర్ వింటే ఆశ్చర్యపోవాల్సిందే..!

పెళ్లి చేసుకుంటానన్న అభిమాని.. మృణాల్ ఆన్సర్ వింటే ఆశ్చర్యపోవాల్సిందే..!

by Anji
Ad

మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈమె మహారాష్ట్రలోని ధూలెలో జన్మించింది. కళాశాల రోజుల్లోనే బుల్లితెరపై అడుగుపెట్టింది. సీరియల్స్ ద్వారా ఈమె మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆ తరువాత 2014లో మరాఠీ చిత్రం విట్టిదండు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ఆ తరువాత పలు చిత్రాల్లో నటించినా పెద్దగా సక్సెస్ అందుకోలేకపోయింది. 

Advertisement

2018 బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ ‘సూపర్ 30’ లో హృతిక్ రోషన్ సరసన నటించి విమర్శకుల ప్రశంసలను అందుకుంది. ఆ తరువాత ఘోస్ట్ స్టోరీస్, ధమాకా, జెర్సీ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. 2022లో తెలుగులో విడుదలైన సీతారామం చిత్రంతో మృణాల్ ఠాకూర్ క్రేజ్ ను అమాంతం పెంచేసింది. తెలుగుతో పాటు అన్ని భాషల్లో విడుదలైన ఈ చిత్రం మృణాల్ కి దేశవ్యాప్తంగా సూపర్బ్ క్రేజ్ తెచ్చిపెట్టింది.

Advertisement

ఈ సినిమాకి ప్రముఖులతో పాటు విమర్శకుల ప్రశంసలు సైతం అందాయి. బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఇప్పుడు హిందీ 5 చిత్రాలు, తెలుగులో నాని సరసన ఓ సినిమాలో నటిస్తోంది. తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించింది. ఈ క్రమంలోనే ఓ అభిమాని మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నా వైపు నుంచి ఓకే అంటూ అతను కామెంట్ చేశాడు. దీనికి రిప్లై గా మృణాల్ మాత్రం నా వైపు నుంచి ఓకే కాదుగా అని పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 

Also Read :  ఎన్టీఆర్ ను కావాలనే పక్కన పెట్టారా….? పూర్తి క్లారిటీ ఇదే…!

Visitors Are Also Reading