Home » శ్రీ‌దేవి డ్రామా కంపెనీలో డ్యాన్స్ చేసిన ఈ లేడీ కండ‌క్ట‌ర్ పారితోషికం ఎంత తీసుకుందో తెలుసా..?

శ్రీ‌దేవి డ్రామా కంపెనీలో డ్యాన్స్ చేసిన ఈ లేడీ కండ‌క్ట‌ర్ పారితోషికం ఎంత తీసుకుందో తెలుసా..?

by Anji
Ad

ఈటీవీలో ప్ర‌సారం అవుతున్న శ్రీ‌దేవి డ్రామా కంపెనీ ఎంతో మంది కొత్త వారిని బుల్లితెర‌కు ప‌రిచ‌యం చేస్తుంద‌నడంలో ఎలాంటి సందేహం లేదు. తాజాగా గాజువాక ఆర్టీసీ డిపోకి చెందిన ఓ లేడి కండక్ట‌ర్ వ‌చ్చింది. ఆమె శ్రీ‌దేవి డ్రామా కంపెనీ ఎలా వ‌చ్చింది..? పారితోషికం ఎంత తీసుకుంటుందో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

ఇవి కూడా చ‌ద‌వండి :  ఇంట్లో అంతమంది హీరోలు ఉన్నా చిరంజీవి తల్లిగారికి మాత్రం ఆ హీరో అంటే ఇష్టమట…! ఆ హీరో ఎవరంటే…?

Advertisement

న‌న్ను విమ‌ర్శించిన వారే నా వెనుకే ఆగిపోయారు. నేను ముందు ఉన్నాను. క‌ష్టం తెలిసి శ్ర‌మ‌ను న‌మ్ముకున్న వాళ్ల మాట‌లు ఈ డ్యాన్స‌ర్ ఝాన్సీ మాదిరిగా ఉంటాయి. ఆమె తండ్రి ప్ర‌భుత్వ ఉద్యోగి. న‌లుగురికి బాధ్యత నేర్పించాల్సిన పోలీస్ కానిస్టేబుల్ త‌న బాధ్య‌త‌ను మ‌రిచి భార్య‌, పిల్ల‌ల‌ను రోడ్డు వ‌దిలేశాడు. దిక్కుతోచ‌ని ప‌రిస్థితిలో ఉన్న త‌ల్లికి అండ‌గా నిలిచింది ఝాన్సి. ఒక వైపు చ‌దువుకుంటూనే త‌న‌కు ఎంతో ఇష్ట‌మైన డ్యాన్స్‌ని కూడా మ‌రోవైపు నేర్చుకుంది. రోడ్డుమీద డ్యాన్స్‌లేంటి..? ఛీ ఛీ ఇదేం బ‌తుకు అని ఛీద‌రించుకున్న వారే ఇప్పుడు వారెవ్వా ఏమైనా చేసిందా అనే స్థాయికి ఎదిగింది.

ఇటీవ‌లే శ్రీ‌దేవి డ్రామా కంపెనీని షేక్ చేసిన గాజువాక లేడీ కండ‌క్ట‌ర్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ట్రెండ్ సృష్టిస్తోంది. శ్రీ‌దేవి డ్రామా కంపెనీ తాజా ప్రోమోలో ప‌ల్స‌ర్ బైకు సాంగ్‌తో స్టేజ్‌ని షేక్ షేక్ చేసింది ఈ లేడీ కండ‌క్ట‌ర్‌. వాస్త‌వానికి ఆమె మైకు తీసుకొని నేను ఏపీఎస్ఆర్‌టీసీ గాజువాక డిపోలో కండ‌క్ట‌ర్ అని చెప్పే వ‌ర‌క అంద‌రూ ఒక్క‌సారిగా ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు. గాజువాక నుంచి హైద‌రాబాద్‌కి చేరుకున్న ఝాన్సీ జీవితంలో ఎన్నో ఆటుపోట్ల‌ను చూసింది. ఆమె జీవితంలో ఎదుర్కొన్న ఒడిదొడుకుల గురించి ఆమె మాట‌ల్లోనే విందాం.

ఇవి కూడా చ‌ద‌వండి :  అఖండ, కార్తికేయ సహా టాలీవుడ్ లో దేవుడి కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాల లిస్ట్…! ఏది హిట్ ఏది ఫట్…?

Advertisement


చిన్న‌ప్ప‌టి నుంచే నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. నాకు తొలుత ఇంట్లో నుంచి మ‌ద్దతు ల‌భించ‌లేదు. కానీ అదే ఇప్పుడు నాకు అన్నం పెడుతుంది. ఇవాళ నేను స్టేజ్ డ్యాన్స‌ర్ నుంచి పెద్ద పెద్ద వేదిక‌ల‌పై డ్యాన్స్ చేస్తున్నానంటే కార‌ణం మా గురువు ర‌మేష్ గారు. నేను గాజువాడ డిపో కండ‌క్ట‌ర్ గా 11 ఏళ్లుగా ప‌ని చేస్తున్నాను. ఇక అప్ప‌టి నుంచి నేను డ్యాన్స్ చేస్తూనే ఉన్నాను. కానీ అప్ప‌ట్లో సోషల్ మీడియా అంత ఫేమ‌స్ కాదు. ఇప్పుడు సోష‌ల్ మీడియా ద్వారా నాకు ఇంత పేరు వ‌చ్చింది. నాలో ఉన్న ఎన‌ర్జీని మ‌రింత పెంచిది. శ్రీ‌దేవి డ్రామా కంపెనీలో డ్యాన్స్ చేయ‌డం ద్వారా మంచి పేరు సంపాదించుకున్న‌ట్టు వెల్ల‌డించింది ఝాన్సీ. ప్ర‌స్తుతం ఆమె డ్యాన్స్ కి ప్ర‌తీ ఒక్క‌రూ ఫిదా అవుతున్నారు. పెద్ద పెద్ద సినిమాల్లో ఆమెకు ఐటెం సాంగ్ ఆఫ‌ర్ ఇచ్చే స్థాయిలో ఆమె డ్యాన్స్ ఉందంటూ కొంద‌రూ అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇక ఆ రేంజ్‌లో డ్యాన్స్ చేసిన ఈ లేడీ కండ‌క్ట‌ర్‌కి ఈటీవీ మ‌ల్లెమాల వారు ఇచ్చిన పారితోషికం ఎంత అనేది ప్ర‌స్తుతం చాలా మందిలో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఆమె రెండు రోజుల పాటు శ్రీ‌దేవి డ్రామా కంపెనీ కోసం తేదీలు కేటాయించింది. అందుకు మ‌ల్లెమాల వారు ఆమెకు రెండున్న‌ర ల‌క్ష‌ల వ‌ర‌కు పారితోష‌కంగా ఇచ్చారంటూ స‌మాచారం. ఆమెకు పారితోషికం త‌క్కువే అయిన‌ప్ప‌టికీ.. ఆమె ఈటీవీలో క‌నిపించ‌డం ద్వారా అద్భుత‌మైన ఆప‌ర్లు ఆమెకు వ‌స్తూనే ఉన్నాయి. ఇలా ఆఫ‌ర్లు రావ‌డంతో ఇక‌ ఆమె కండ‌క్ట‌ర్ గా జాబ్ మానేసే అవ‌కాశం ఉంది. ఆమెకు ఇది మంచి అవ‌కాశంగా చెప్పుకోవ‌చ్చు. పారితోషికం విషయం ప‌క్క‌న పెడితే ఈటీవీ శ్రీ‌దేవి డ్రామా కంపెనీలో ఆమె క‌నిపించ‌డ‌మే గొప్ప విష‌య‌మంటూ కొంద‌రూ అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. మొత్తానికి ఈటీవీ శ్రీ‌దేవి డ్రామ కంపెనీ వారు ఒక మంచి ప్ర‌తిభ‌వంతురాలుని బుల్లితెర‌కు, ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేశార‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు.

ఇవి కూడా చ‌ద‌వండి :  ఘ‌నంగా అలీ కూతురు ఎంగేజ్‌మెంట్‌.. పెళ్లి కొడుకు ఎవ‌రంటే..?

Visitors Are Also Reading