Home » అఖండ, కార్తికేయ సహా టాలీవుడ్ లో దేవుడి కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాల లిస్ట్…! ఏది హిట్ ఏది ఫట్…?

అఖండ, కార్తికేయ సహా టాలీవుడ్ లో దేవుడి కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాల లిస్ట్…! ఏది హిట్ ఏది ఫట్…?

by AJAY
Ad

సినిమాల‌లో ఒక్కో నేప‌థ్యంలో వ‌చ్చిన సినిమాల‌కు ఒక్కో ర‌క‌మైన క్రేజ్ ఉంటుంది. అలా దేవుడి బ్యాక్ డ్రాప్ లో వ‌చ్చిన సినిమాల‌కు కూడా ఓ క్రేజ్ ఉంటుంది. దేవుడి బ్యాక్ డ్రాప్ లో వ‌చ్చిన చాలా సినిమాలు మంచి విజ‌యం సాధించాయి. చిన్న హీరోల నుండి బ‌డా హీరోల వ‌రకూ అలాంటి సినిమాల‌లో న‌టించి సూప‌ర్ హిట్ లు అందుకున్నారు. మ‌రి కొన్ని సినిమాలు కూడా అదే బ్యాక్ డ్రాప్ లో వ‌చ్చి ఫ్లాప్ అయ్యాయి. ఆ సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం…

Advertisement

రీసెంట్ గా వ‌చ్చిన కార్తికేయ సినిమా శ్రీకృష్ణుడు ద్వారక అనే కాన్సెప్ట్ తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమా ను పాన్ ఇండియా లెవ‌ల్ లో విడుద‌ల చేశారు. ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. బాలీవుడ్ లోనూ ఈ సినిమా క‌లెక్ష‌న్స్ తో దూసుకుపోతోంది.బాల‌య్య హీరోగా వ‌చ్చిన అఖండ సినిమా శివుడి కాన్సెప్ట్ తో వ‌చ్చింది. ఈ సినిమాలో బాల‌య్య డ్యూయ‌ల్ రోల్ చేశారు. అంతే కాకుండా ఓ పాత్ర‌లో బాల‌య్య అఘోర పాత్ర‌లో న‌టించి మెప్పించారు. ఈ సినిమా కూడా బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది.

Advertisement

చిరంజీవి హీరోగా న‌టించిన ఆచార్య సినిమా కూడా దేవుడి బ్యాక్ డ్రాప్ లోనే వ‌చ్చింది. దేవ‌స్థానం ను ర‌క్షించ‌డం అనే కాన్సెప్ట్ తో వ‌చ్చిన ఈ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది.

ప్ర‌స్తుతం ప్ర‌భాస్ హీరోగా ఆదిపురుష్ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను పూర్తిగా రామాయ‌ణం నేప‌థ్యంలో తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. మ‌రి ఈ సినిమా ఏ మేర‌కు అల‌రిస్తుందో చూడాలి.

Visitors Are Also Reading